- Telugu News Photo Gallery Cricket photos Indias world cup preparation starts from thursday with west indies 1st odi
Team India: వన్డే ప్రపంచ కప్ జర్నీ షురూ చేసిన రోహిత్ సేన.. ఫైనల్ 15పైనే అందరి చూపు.. తొలి వన్డేతో తేలనున్న భవితవ్యం..
Team India: గురువారం నుంచి భారత్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహాలు కూడా ప్రారంభం కానున్నాయి.
Updated on: Jul 25, 2023 | 6:59 PM

Team India: గురువారం నుంచి భారత్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహాలు కూడా ప్రారంభం కానున్నాయి.

అంటే అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు కేవలం 2 వన్డేల సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. ఈ సిరీస్‌లో మొత్తం 6 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత జట్టు మొదట వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను ఆడి, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది.

వీటి మధ్య ఆసియా కప్ కూడా జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తే.. మొత్తం 5 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అంటే వన్డే ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా 11 వన్డే మ్యాచ్‌లు (ఆసియా కప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశిస్తే 6+5) ఆడే అవకాశం ఉంది.

దీని ద్వారా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహాలు చేయనుంది. ముఖ్యంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు వచ్చే ఆసియాకప్‌లో అవకాశం కల్పించనున్నారు. ఆసియాకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కావడం ఖాయంగా నిలిచింది.

అందుకే రాబోయే వన్డే మ్యాచ్‌లు టీమిండియా ఆటగాళ్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌ల్లో తళుక్కుమంటేనే వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కుతుంది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్న టీమ్ ఇండియాలో వన్డే ప్రపంచకప్‌నకు ఎంపికయ్యే 15 స్థానాలకు పోటీ ఉందనడంలో తప్పులేదు.




