- Telugu News Photo Gallery Cinema photos Sakshi Dhoni interesting comments on Allu Arjun and Telugu movies
Sakshi Dhoni: బన్నీ సినిమాలన్నీ చూస్తా.. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని: ధోని సతీమణి సాక్షి
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు సినిమాల్లో సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఎంఎస్ ధోని ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా అవతారమెత్తాడు. ఇందులో ఆయన సతీమణి సాక్షి ధోని కూడా పార్ట్‌నర్‌గా ఉంది.
Updated on: Jul 25, 2023 | 4:26 PM

టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు సినిమాల్లో సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఎంఎస్ ధోని ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా అవతారమెత్తాడు. ఇందులో ఆయన సతీమణి సాక్షి ధోని కూడా పార్ట్‌నర్‌గా ఉంది.

మొదటిగా ఎల్‌జీఎం (లెట్స్ గెట్ మ్యారీ) అనే సినిమాను తెరకెక్కించారు. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌లో లవ్‌టుడే ఫేమ్ ఇవానా, హరీష్ కల్యాణ్ జోడీగా నటించారు. అలాగే నదియా, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఎల్‌జీఎం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇటీవలే ఎల్‌జీమ్ ట్రైలర్‌ను తెలుగులో విడుదల చేశారు.

తాజాగా హైదరాబాద్‌లో విలేకరు సమావేశం ఏర్పాటు చేసింది ఎల్‌జీఎమ్ యూనిట్. ఎల్‌జీఎమ్ నిర్మాత, ధోని సతీమణి సాక్షితో పాటు నటీనటులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమాలన్నీ చూస్తానని, ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పుకొచ్చింది సాక్షి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.