Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 5 Movies News : అదిరిపోయిన నారా రోహిత్‌ మూవీ పోస్టర్.. బ్రో కోసం పవన్ ఉపవాసం

హీరో నారా రోహిత్‌ కమ్‌ బ్యాక్‌ సినిమా ప్రతినిధి2. ఈ చిత్రం టైటిల్‌ లోగో, ఫస్ట్ లుక్‌ సూపర్‌గా ఉందంటూ ప్రశంసలు అందుతున్నాయి. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 25, 2023 | 3:07 PM

 బ్రో సినిమాను 53 రోజుల్లో పూర్తి చేశామని అన్నారు డైరక్టర్‌ సముద్రఖని. పవన్‌ కల్యాణ్‌ స్క్రిప్ట్ విన్న మూడో రోజు నుంచే షూటింగ్‌ మొదలుపెట్టేశారని చెప్పారు. సమయం వృథా కాకూడదని, సెట్లోనే ఆయన కాస్ట్యూమ్స్ మార్చుకునేవారని తెలిపారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు పవన్‌ కల్యాణ్‌ ఉపవాసం ఉన్నారని అన్నారు. ఎంతో నిష్టతో పనిచేసినట్టు తెలిపారు.

1 / 5
మీనా కుమారి బయోపిక్ విషయంలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు మనీష్ మల్హోత్రా. ఆ సినిమాతో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇస్తామన్నారు. ఈ సినిమాలో కృతి సనన్‌ టైటిల్‌ రోల్‌లో నటించబోతున్నారు.

2 / 5
వెండితెర మీద యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా కనిపించబోతున్నారు కమల్ హాసన్‌. ఇండియన్ 2 సినిమాలో ఈ అద్భుతాన్ని చూపించబోతున్నారు దర్శకుడు శంకర్‌. గ్రాఫిక్స్ ద్వారా కమల్‌ను యంగ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డీ ఏజింగ్‌ టెక్నాలజీకి పాపులర్ అయిన లోలా వీఎఫ్ఎక్స్‌ కంపెనీ ఇండియన్ 2 సినిమా కోసం వర్క్ చేస్తోంది.

3 / 5
హీరో నారా రోహిత్‌ కమ్‌ బ్యాక్‌ సినిమా ప్రతినిధి2. ఈ చిత్రం టైటిల్‌ లోగో, ఫస్ట్ లుక్‌ సూపర్‌గా ఉందంటూ ప్రశంసలు అందుతున్నాయి. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. సామాజిక సమస్యతో ప్రతినిధి2ని రూపొందిస్తున్నారు.

4 / 5
తల్లికి, ప్రేయసికి మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథతో తెరకెక్కిన సినిమా లెట్స్ గెట్‌ మ్యారీడ్‌. ఈ నెల 28న విడుదల కానుంది. ధోనీ నిర్మాణ సంస్థ నిర్మించింది. తన సినిమాలో నటించిన ప్రతి ఒక్కరినీ కలుసుకుని ధోనీ మాట్లాడారు. సినిమా చూసి ధోనీ చాలా ఎంజాయ్‌ చేశారని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు హరీష్‌ కల్యాణ్‌.

5 / 5
Follow us