Viral Video: ఆమ్యామ్యా.. తీసుకుంటూ అడ్డంగా బుక్కైన అధికారి..! భయంతో డబ్బు మొత్తం నమిలి మింగేశాడు

చం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడో రెవెన్యూ అధికారి. ఎదురుగా అధికారులు కనిపించేసరికి ఎంచెయ్యాలో తోచక లంచం డబ్బును నోట్లో వేసుకుని కసపిస నిమిలి మింగేశాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ నగరంలో..

Viral Video: ఆమ్యామ్యా.. తీసుకుంటూ అడ్డంగా బుక్కైన అధికారి..! భయంతో డబ్బు మొత్తం నమిలి మింగేశాడు
Gajendra Singh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 26, 2023 | 7:10 AM

భోపాల్‌, జులై 26: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడో రెవెన్యూ అధికారి. ఎదురుగా అధికారులు కనిపించేసరికి ఎంచెయ్యాలో తోచక లంచం డబ్బును నోట్లో వేసుకుని కసపిస నిమిలి మింగేశాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ నగరంలో సోమవారం (జులై 24) చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని కట్నీ ప్రాంతంలోని రెవెన్యూ విభాగంలో గజేంద్రసింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం తన వద్దకు వచ్చిన బార్ఖేడా గ్రామానికి చెందిన వ్యక్తిని రూ.5 వేల లంచం అడిగాడు. దీంతో సదరు వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. సోమవారం నాడు ఆ వ్యక్తి గజేంద్రసింగ్‌ చాంబర్‌లోకి వెళ్లి అతను అడిగిన రూ.5 వేల లంచం ఇస్తుండగా స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (SPE) ఎంట్రీ ఇచ్చారు. చేతిలో నోట్లతో అధికారులకు కనిపించేసరికి, వెంటనే గజేంద్రసింగ్‌ ఆ డబ్బులు మొత్తం అమాంతం నోట్లో కుక్కి నమిలి మింగేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఊహించని పరిణామానికి నివ్వెరపోయిన అధికారులు వెంటనే అతని నోటిని తెరచి కరెన్సీ నోట్లను బయటికి తీయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే గజేంద్రసింగ్‌ మెత్తగా నిమిలి మింగేశాడు. దీంతో అధికారులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గజేంద్రకు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఈ వ్యవహారమంతా కెమెరాకు చిక్కడంతో అదికాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..