Mysterious Video: ఆకాశంలో కనిపించిన ‘స్వర్గానికి ప్రవేశ ద్వారం’.. అంతుచిక్కని మిస్టరీగా వింత ఆకారం

మేఘావృతమైన ఆకాశంలో ఓ మిస్టీరియస్‌ ఆకారం కనిపించడం ప్రస్తుతం చర్చణీయాంశమైంది. ఆకాశంలో ద్వారాలు (తలుపులు) మాదిరి ఉన్న ఆకారం ఒకటి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. బెంగళూరులోని..

Mysterious Video: ఆకాశంలో కనిపించిన 'స్వర్గానికి ప్రవేశ ద్వారం'.. అంతుచిక్కని మిస్టరీగా వింత ఆకారం
Mysterious Video
Follow us

|

Updated on: Jul 25, 2023 | 10:55 AM

బెంగళూరు, జులై 25: మేఘావృతమైన ఆకాశంలో ఓ మిస్టీరియస్‌ ఆకారం కనిపించడం ప్రస్తుతం చర్చణీయాంశమైంది. ఆకాశంలో ద్వారాలు (తలుపులు) మాదిరి ఉన్న ఆకారం ఒకటి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రాత్రి ఈ వింత కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వసీమ్‌ అనే యూజర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆకాశంలో భవనం, ఆ భవనానికి సంబంధించిన తలుపులు, తలుపుల వెనుక ప్రకాశవంతమైన వెలుగు కనిపించడం వెనుక ఉన్న సైన్స్ రహస్యం ఏమై ఉండవచ్చు? అని ప్రతిఒక్కరూ జుట్టులు పీక్కుంటున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరేమో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది మరో ప్రపంచానికి ప్రవేశ మార్గం అని, బెంగుళూరు వాతావరణంలో ఏలియన్స్ తమ బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సరదాగా కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చారు. ఒక వేళ అది ఏలియన్స్‌ పనే అయితే దయచేసి మా రోడ్లను బాగు చేసి వెల్లండి అని, కొత్తగా రీల్స్‌ ఏమైన ట్రై చేస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

ఇవి కూడా చదవండి

అవి స్వర్గానికి ప్రవేశ ద్వారాలంటూ మరికొందరు ఆధ్యాత్మికను జోడించారు. అచ్చం ఇలాంటి రూపమే చైనాలో 2017లో ఆకాశంలో కనిపించిందని మరో యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో తెలిపారు. ఏదిఏమైనప్పటికీ ఇది టెక్నాలజీ సృష్టించిన జిమ్మిక్కో, లేదా నిజంగానే ఆకాశంలో ఇలాంటి వింత జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌