- Telugu News Photo Gallery Cinema photos Actress Noorin Shereef gets married to Fahim Safar, Photos viral
Noorin Shereef Wedding: హీరోని పెళ్లాడిన యంగ్ హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్
యంగ్ హీరోయిన్ నూరిన్ షరీఫ్, ప్రియుడు ఫహిమ్ సఫర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సహ నటుడైన ఫహిమ్ సఫర్‌ను నటి నూరిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. తిరువనంతపురంలో సోమవారం వీరి నిఖా జరిగింది..
Updated on: Jul 25, 2023 | 7:47 AM

యంగ్ హీరోయిన్ నూరిన్ షరీఫ్, ప్రియుడు ఫహిమ్ సఫర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సహ నటుడైన ఫహిమ్ సఫర్‌ను నటి నూరిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. తిరువనంతపురంలో సోమవారం వీరి నిఖా జరిగింది.

గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఈ బ్యూటీ స్వయంగా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటి ప్రియా ప్రకాశ్ వారియర్ 'లవర్స్ డే' (మలయాళంలో 'ఒరు అదార్ లవ్') అనే సినిమాతో నూరిన్ షరీఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ నూరిన్ షరీఫ్ అయినప్పటికీ ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు.

దీంతో మలయాళంలోనే నటిగా స్థిరపడిపోయింది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నూరిన్ షరీఫ్ 'చంక్జ్' మువీతో నటిగా అరంగెట్రం చేసింది. ఆ తర్వాత ఒరు అదార్ లవ్, శాంతాక్రూజ్, వెళ్లప్పం, బర్ముడా, ఆన్ ద అదర్ హ్యాండ్ వంటి సినిమాల్లో నటించింది.

ఓ సినిమాకు పనిచేస్తున్న క్రమంలో యాక్టర్ కమ్ రైటర్ అయిన ఫహిమ్ సఫర్, నూరిన్ షరీప్ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అవ్వడం ప్రేమలో పడటం, నిశ్చితార్ధం, పెళ్లి అంతా చకచకా జరిగిపోయింది.





























