సింగర్‌తో నిశ్చితార్ధం చేసుకున్న ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్
మరాఠీ నటి స్వానంది టికేకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇండియన్ ఐడల్12 కంటెస్టెంట్, సింగర్ ఆశిష్ కులకర్ణితో గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న స్వానంది ఆదివారం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో..
మరాఠీ నటి స్వానంది టికేకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇండియన్ ఐడల్12 కంటెస్టెంట్, సింగర్ ఆశిష్ కులకర్ణితో గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న స్వానంది ఆదివారం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్నారు. నిశ్చితార్ధ వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో ఈ జంట కనిపించింది. వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను నటి స్వానంది తన ఇన్‌స్టా ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రముఖ మరాఠీ నటుడు ఉదయ్ టికేకర్, ప్రసిద్ధ సింగర్ ఆరతి అంకాలికర్ దంపతుల కుమార్తె స్వానంది. కొన్ని రోజుల క్రితం నటి స్వానంది, సింగర్ ఆశిష్ కులకర్ణి తమ సంబంధం గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. గత శుక్రవారం వీరి ఇద్దరూ తమ నిశ్చితార్థ మెహెందీ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ తమ బంధం గురించి వెల్లడించారు.
View this post on Instagram
View this post on Instagram
స్వానంది ‘అగా ఆగ సున్‌బాయి’, ‘దిల్ దోస్తీ దునియాదారి’ వంటి టీవీ సీరియల్స్‌తో పాపులారిటీ దక్కించుకుంది. అంతే కాకుండా ఏక్ శూన్య తీన్, డోంట్ వర్రీ బి హ్యాపీ వంటి పలు సినిమాల్లోనూ అలరించింది ఈ బ్యూటీ. ఇక సింగర్ ఆశిష్ విషయానికొస్తే.. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో కంటెస్టెంట్‌గా ఫేమస్ అయ్యాడు. పలు మరాఠీ మువీల్లో ప్లేబ్యాక్ సింగర్‌గానూ స్వరాలందించారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.