ఒక్కసారిగా కుప్పకూలిన జిమ్ పై కప్పు.. 10 మంది మృతి!
Gym Roof Collapsed: చైనాలో ఓ స్కూల్‌లో ఉన్న జిమ్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, ఒకరు శిథిలాల్లో చిక్కుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా సోమవారం..
బీజింగ్, జులై 24: చైనాలో ఓ స్కూల్‌లో ఉన్న జిమ్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, ఒకరు శిథిలాల్లో చిక్కుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా సోమవారం నివేదించింది. ఈశాన్య చైనా హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లో ఉన్న మిడిల్ స్కూల్‌లోని జిమ్ పై కప్పు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. సోమవారం ఉదయం నాటికి శిథిలాల నుంచి 14 మంది మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 6 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
సీసీటీవీ ఫుటేజీలో బిల్డింగ్ కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. 39 అగ్నిమాపక వాహనాలు, 160 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. భారీ వర్షాల కారణంగా భవనం కూలిపోయినట్లు సమాచారం. బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఈ దేశ వార్తసంస్థలు తెలిపాయి. కాగా చైనాలో భవన నిర్మాణ పనుల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. టియాంజిన్ నగరంలో 2015లో రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ పేలుడు కారణంగా 165 మంది మృత్యువాత పడ్డారు.
10 were confirmed dead and 1 remained trapped after the roof of a school gymnasium collapsed on Sunday in Qiqihar, NE China’s Heilongjiang. Preliminary investigation found the accident was caused by perlite illegally placed on the roof, which weighed down under rainfall. pic.twitter.com/XhdVkpmh2D
— People’s Daily, China (@PDChina) July 24, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.