Kakinada: 6 నెలల క్రితం బాలుడికి కుక్కకాటు.. చికిత్స తీసుకోకపోవడంతో రేబీస్‌ వ్యాధి సోకి మృతి!

కుక్క కరిచిన విషయం ఇంట్లో చెప్పకుండా దాచాడు 17 ఏళ్ల బాలుడు. నిర్లక్ష్యం వహించి చికిత్స తీసుకోకపోవడంతో 6 నెలల తర్వాత మృత్యువాత పడ్డాడు. ఈ షాకింగ్‌ ఘటన కాకినాడ జిల్లాలో ఆదివారం చోటు..

Kakinada: 6 నెలల క్రితం బాలుడికి కుక్కకాటు.. చికిత్స తీసుకోకపోవడంతో రేబీస్‌ వ్యాధి సోకి మృతి!
7 Year Old Boy Died Of Rabies
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 24, 2023 | 8:41 AM

గొల్లప్రోలు, జులై 24: కుక్క కరిచిన విషయం ఇంట్లో చెప్పకుండా దాచాడు 17 ఏళ్ల బాలుడు. నిర్లక్ష్యం వహించి చికిత్స తీసుకోకపోవడంతో 6 నెలల తర్వాత మృత్యువాత పడ్డాడు. ఈ షాకింగ్‌ ఘటన కాకినాడ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన తేలు ఓంసాయి (17)ని ఆరు నెలల కిందట వీధి కుక్క కరిచింది. ఇంట్లో చెబితే మందలిస్తారనే భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. దీంతో గత 3 రోజుల నుంచి బాలుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా నీళ్లు తాగలేకపోవడం, నీళ్లను చూసి భయపడటం చేస్తున్నాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు బాలుడిని కాకినాడ జీజీహెచ్‌లో శనివారం చేర్చారు.

వైద్యులు చికిత్స అందించినప్పటికీ వ్యాధి ముదిరి ఆదివారం మృతి చెందాడు. 6 క్రితం తమ కుమారుడిని కుక్క కరిచిందని, అప్పుడు వైద్యం చేయించామని తల్లిదండ్రులు తెలిపారు. ఎదిగిన కుమారుడు తమ కళ్ల ఎదుటే మృతి చెందడంతో వారు గుండెలవిసేలా విలపించారు. కాగా ఈ మధ్యకాలంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. కుక్క కాటుకు గురైనవారు నిర్లక్ష్యం వహించకుండా అదే రోజున యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌, టీటీ ఇంజక్షన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజున వ్యాక్సిన్‌ తీసుకుంటే రేబీస్‌ ముప్పు తప్పుతుందని గొల్లప్రోలు పీహెచ్‌సీ వైద్యాధికారిణి శ్యామల సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.