- Telugu News Photo Gallery Cinema photos Actress Nandita Swetha Cries on Stage during Hidimba Movie Success Meet
స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న హీరోయిన్.. ‘సెంటిమెంట్‌గా కనెక్ట్ అయ్యా..’
టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు, నటి నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో ఈ మువీని తెరకెక్కించారు..
Updated on: Jul 23, 2023 | 1:46 PM

టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు, నటి నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో ఈ మువీని తెరకెక్కించారు.

అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసును ఛేదించే కథానేపథ్యంతో ఈ మువీని రూపుదిద్దుకుంది. జులై 21న విడుదలైన ఈ మువీ థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో నటి శ్వేత భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్‌పై మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అది కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా ఈ మువీ నచ్చుతుంది. ఈ మువీలో అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి సీరియస్ రోల్ చేస్తాననుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచారు. అశ్విన్, అనిల్ సపోర్ట్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలిగాను

'ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తర్వాత ‘హిడింబ’ మువీతో నాకు మంచి పేరు వచ్చింది. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు చాలా కృతజ్ఞతలు. ఈ మువీ నాకు సెంటిమెంట్‌గా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే, ఈ సినిమా షూట్‌లో ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. ఆయన ఆశీస్సుల వల్లే ఈ రోజు నాకు ఇంత మంచి పేరు వచ్చిందనుకుంటున్నానంటూ నందితా శ్వేత కన్నీరు పెట్టుకున్నారు.





























