మంచి నీళ్లనుకుని యాసిడ్‌ తాగిన మహిళా కూలీ

మంచి నీళ్లనుకుని యాసిడ్‌ తాగిందో మహిళా కార్మికురాలు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన..

మంచి నీళ్లనుకుని యాసిడ్‌ తాగిన మహిళా కూలీ
Woman Mistakenly Drank Acid
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 23, 2023 | 8:47 AM

చెన్నై, జులై 23: మంచి నీళ్లనుకుని యాసిడ్‌ తాగిందో మహిళా కార్మికురాలు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో, రింగు థాకరే అనే మహిళా కార్మికురాలు బాటిళ్లను క్లీన్ చేసే ఫ్యాక్టరీలో పని చేస్తుంది. అక్కడ వాడేసిన మద్యం బాటిళ్లను యాసిడ్‌తో శుభ్రం చేసి మద్యం కంపెనీలకు విక్రయిస్తుంటారు. బుధవారం నాడు పని చేస్తున్న సమయంలో రింగు థాకరేకు దాహం వేయడంతో నీళ్ల కోసం కార్మికురాలిని అడిగింది.

ఆమె చూసుకోకుండా నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ బాటిల్‌ అందించింది. అవి మంచి నీళ్లు అనుకుని సదరు మహిళ తాగేసింది. దీంతో ఒక్కసారిగా నోరంతా మండటంతో బాధిత మహిళ అరవడం ప్రారంభించింది. ఫ్యాక్టరీ సూపర్‌వైజర్, తోటి కార్మికులు ఆమెను హుటాహుటీన బర్వాహా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఖర్గోన్‌ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!