Rice Shortage: బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం.. షాపుల వద్ద బారులు తీరిన ఎన్నా’రైస్’

బియ్యం ధరలకు కళ్లెం వేయడానికి బియ్యం ఎగుమత్తులపై కేంద్రం తాజాగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఆహార కొరత లేకుండా చూసేందుకు విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను..

Rice Shortage: బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం.. షాపుల వద్ద బారులు తీరిన ఎన్నా'రైస్'
Rice Shortage
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 23, 2023 | 7:39 AM

న్యూఢిల్లీ, జులై 23: బియ్యం ధరలకు కళ్లెం వేయడానికి బియ్యం ఎగుమత్తులపై కేంద్రం తాజాగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఆహార కొరత లేకుండా చూసేందుకు విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అమెరికాలో గందరగోళానికి దారితీసింది. అమెరికాతోపాటు పలు దేశాల్లోని బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ధరలు పెరుగుతాయోనన్న భయంతో ముందుగానే విదేశాల్లోని భారతీయులు బియ్యం కోసం రిటైల్‌ ఔట్‌లెట్ల వద్ద బారులుతీరారు.తెలుగువారు ఎక్కువగా నివసించే డాలస్, అట్లాంటా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోని స్టోర్ల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.

దీంతో ఇదే అదనుగా అక్కడి మార్కెట్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిషేధానికి ముందు వరకు 9.07 కిలోల బ్యాగ్‌ను 16 నుంచి 18 డాలర్ల (మన కరెన్సీలో రూ.1,312 నుంచి1,476)కు విక్రయించిన వ్యాపారస్తులు దాదాపు మూడు రెట్లు అధిక ధరలకు విక్రాయిస్తున్నారు. ఒక్కో బ్యాగ్‌ను దాదాపు 47 డాలర్ల (రూ.3,854) వరకు విక్రయిస్తున్నారు. మరి కొన్ని స్టోర్ల యజమానులు బియ్యం బ్యాగ్‌ల కొనుగోలుపై పరిమితి విధించారు కూడా. సోనామసూరి రకం బియ్యానికి కొరత ఏర్పడుతుందన్న భయంతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు మన ఎన్నారైలు. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో బియ్యం బస్తాలు వాహనాల్లో వేసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

భారత్‌ నుంచి నెలకు సగటున 6 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం యూఎస్‌ఏకు ఎగుమతి అవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే 4 వేల మెట్రిక్‌ టన్నులు ఉంటుందని సమాచారం. అమెరికాలో ప్రస్తుతం 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉండగా మరో 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి రవాణాలో ఉంది. ఇవి ఆరు నెలలకు సరిపోతాయని అంచనా. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్‌ వాటా దాదాపు 40 శాతం ఉంది. నెలకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం భారత్‌ నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.