Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే..?
Gold and Silver Latest Prices: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఎలాంటి శుభకార్యాలు జరిగినా బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. కావున, అందరూ బంగారం ధరలపై ఆసక్తి చూపుతుంటారు.
Gold and Silver Latest Prices: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఎలాంటి శుభకార్యాలు జరిగినా బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. కావున, అందరూ బంగారం ధరలపై ఆసక్తి చూపుతుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.250 మేర తగ్గి రూ.55,150 మేర ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.280 మేర తగ్గి రూ.60,160గా ఉంది. కిలో వెండి ధర రూ.1000 మేర తగ్గి రూ.78000 లుగా కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు: ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.55,150, 24క్యారెట్లు 60,160, చెన్నైలో 22క్యారెట్లు రూ.55,550, 24క్యారెట్లు 60,600, బెంగళూరులో 22క్యారెట్లు రూ.55,150, 24క్యారెట్లు 60,160 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22క్యారెట్లు రూ.55,150, 24క్యారెట్లు రూ.60,160గా ఉంది.
వెండి ధరలు: ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000 లుగా ఉంది. ముంబైలో రూ.78000, చెన్నైలో రూ.80,500, బెంగళూరులో రూ.76,500, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధరరూ.80,500 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. కాగా.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..