‘నా పొట్ట నా ఇష్టం’ రెస్టారెంట్.. నెట్టింట నవ్వులు పూయిస్తోన్న హోటళ్ల పేర్లు
ఇటీవల కాలంలో భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు వినూత్నమైన పేర్లు పెడుతుంటారు. డిఫరెంట్ థీమ్స్‌తో, క్యాచీ నేమ్స్‌తో వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఐతే ఆ పేర్లలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే విందుతోపాటు పసందు తోడవుతుంది. తమ క్రియేటివిటీతో వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు నవ్వులుగా..
Updated on: Jul 21, 2023 | 12:20 PM

ఇటీవల కాలంలో భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు వినూత్నమైన పేర్లు పెడుతుంటారు. డిఫరెంట్ థీమ్స్‌తో, క్యాచీ నేమ్స్‌తో వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఐతే ఆ పేర్లలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే విందుతోపాటు పసందు తోడవుతుంది. తమ క్రియేటివిటీతో వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు నవ్వులుగా చేసుకుపోతున్నారు. అలాంటి కొన్ని వింత రెస్టారెంట్ల పేర్లు వింటే నవ్వాపుకోలేరంతే..

లేటెస్ట్‌గా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే రెస్టారెంట్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెస్టారెంట్ పేరుపై పలు ఫన్నీ మీమ్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాజమండ్రిలోని దానవాయిపేటలో ఈ రెస్టారెంట్ ఉంది. ఇదే పేరుతో తెలంగాణ జగిత్యాలలోనూ ఉంది.

మొదట్లో టేస్ట్, క్వాలిటీ బావుంటే చాలనుకునే కస్టమర్లు ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ ఉన్న రెస్టారెంట్లకు తెగ క్యూ కడుతున్నారు.

'సోడా బాటిల్ ఓపెన్ వాలా' ఇదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్. 'రామ్ భరోస్' ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంట్. ఈ ఉత్తరాది రెస్టారెంట్లకు డిమాండ్ మామూలుగా ఉండదు.

ఇక మన హైదరాబాద్ విషయాని కొస్తే.. సెకండ్ వైఫ్, తిందాంరా మామ, తిన్నంత భోజనం, నిరుద్యోగి ఎంఏ & బీఈడి, ఉప్పు కారం, కోడికూర-చిట్టిగారె, దిబ్బ రొట్టి, వియ్యాలవారి విందు, బకాసుర, తాలింపు, తినేసి పో.. వంటి పలు రెస్టారెంట్లు నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి. మీకు కుదిరినప్పుడు వీటిపై ఓ లుక్కేయండి.





























