Telangana: ఎట్టకేలకు ‘ఏసీబీ డీఎస్పీ’ ని పట్టుకున్న పోలీసులు.. నిజమైన డీఎస్సీ కాదండోయ్.. కథ తెలిస్తే కంగుతింటారు..

మోస్ట్‌ వాంటెడ్‌ ఫేక్‌ ఆఫీసర్‌ను అరెస్ట్‌ చేశారు సైబరాబాద్‌ పోలీసులు. ఎంతో మంది ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డ నకిలీ ఏసీబీ డీఎస్పీని కటకటాల వెనక్కి నెట్టారు. ఇంతకీ, ఆ ఫేక్‌గాడు ఎవరు? ఎలా డబ్బులు కొట్టేసేవాడు? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫేక్‌ ఆఫీసర్‌.. పేరు జయకృష్ణ, సొంతూరేమో అనంతపురం, కానీ ఉండేది మాత్రం బెంగళూరు, అక్కడి నుంచే మొత్తం కథ నడిపిస్తాడు.

Telangana: ఎట్టకేలకు ‘ఏసీబీ డీఎస్పీ’ ని పట్టుకున్న పోలీసులు.. నిజమైన డీఎస్సీ కాదండోయ్.. కథ తెలిస్తే కంగుతింటారు..
Arrest
Follow us
Vijay Saatha

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 21, 2023 | 11:23 AM

మోస్ట్‌ వాంటెడ్‌ ఫేక్‌ ఆఫీసర్‌ను అరెస్ట్‌ చేశారు సైబరాబాద్‌ పోలీసులు. ఎంతో మంది ప్రభుత్వాధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డ నకిలీ ఏసీబీ డీఎస్పీని కటకటాల వెనక్కి నెట్టారు. ఇంతకీ, ఆ ఫేక్‌గాడు ఎవరు? ఎలా డబ్బులు కొట్టేసేవాడు? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫేక్‌ ఆఫీసర్‌.. పేరు జయకృష్ణ, సొంతూరేమో అనంతపురం, కానీ ఉండేది మాత్రం బెంగళూరు, అక్కడి నుంచే మొత్తం కథ నడిపిస్తాడు. అవినీతి అధికారులు, గూగుల్‌ తల్లే ఇతగాడి ఆయుధాలు. ఇంటర్నెట్‌ను వాడుకుంటూ గూగుల్‌ ద్వారా పెద్దపెద్ద ఆఫీసర్ల నెంబర్లు సేకరించి సీన్‌లోకి దిగుతాడు. ఏసీబీ ఆఫీసర్‌ పేరుతో బెదిరింపులకు దిగుతాడు. అస్సలు అనుమానం రాకుండా మాట్లాడతాడు. నిజమైన అధికారులు కూడా అలా మాట్లాడరేమో. ఆ రేంజ్‌లో ఫెర్ప్మామెన్స్‌ ఇస్తాడు జయకృష్ణ. ఓ ఇంజనీర్‌కి ఫోన్‌ చేసి, ఈ ఫేక్‌ ఆఫీసర్‌ జయకృష్ణ ఓ రేంజ్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు.

గౌరవంగా మాట్లాడుతూనే అవినీతి, వసూళ్లు, ఫిర్యాదులు అంటూ భయపెడతాడు. ఇంకేముంది అవతల ఫోన్లో ఉన్న అధికారి బెంబేలెత్తిపోవడం ఖాయం. సార్‌ సార్‌ అంటూ కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తాడు. లక్షల రూపాయలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని కథ ముగిస్తాడు. అలా, ఇప్పటివరకు లక్షల రూపాయలు కొట్టేశాడు జయకృష్ణ. బెంగళూరులో ఉంటూ ఏపీ, తెలంగాణలో అనేకమంది అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు జయకృష్ణ. ఏసీబీ పేరు చెప్పి ఇప్పటివరకు 70లక్షల రూపాయలు కాజేశాడు. అతనిపై తెలుగు రాష్ట్రాల్లో 34 కేసులు ఉన్నట్టు తేలింది. ఇప్పటివరకు 2వందల సిమ్‌కార్డులు మార్చేసిన జయకృష్ణ తెలివిగా తిప్పించుకుంటూ తిరుగుతున్నాడు. అయితే, జయకృష్ణను వలేసి పట్టుకుంది శంషాబాద్‌ ఎస్ఓటీ టీమ్‌. జయకృష్ణ నుంచి రూ.2.25 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు, 8 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకొని కటకటాల వెనక్కి నెట్టారు. అయితే, ఇలాంటి బెదిరింపు కాల్స్‌ విషయంలో ఉద్యోగులు అలర్ట్‌గా ఉండాలని, భయపడొద్దని సూచిస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..