Human Sacrifice: గుప్త నిధులు దొరుకుతాయని 9 ఏళ్ల బాలుడు నరబలి
నిధులు దొరుకుతాయనే మూఢ నమ్మకం అభం శుభం ఎరుగని తొమ్మిదేళ్ల పసివాడిని బలి తీసుకుంది. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లవాడి అపహరించి.. క్షుద్రపూజలు నిర్వహించి నరబలి..
ముంబై, జులై 23: నిధులు దొరుకుతాయనే మూఢ నమ్మకం అభం శుభం ఎరుగని తొమ్మిదేళ్ల పసివాడిని బలి తీసుకుంది. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లవాడి అపహరించి.. క్షుద్రపూజలు నిర్వహించి నరబలి ఇచ్చారు. ఈ ఘోరం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా పొహనె షివార్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరు బయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించారు. తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని గుంత తీసి అందులో సగం వరకు పూడ్చిపెట్టారు. ఈ దారుణ ఘటన జులై 18న చోటుచేసుకుంది. శనివారం ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గుప్త నిధుల కోసం ఆన్వేషిస్తున్నారని, దానిలో భాగంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.