BJP Master Plan: కమల వ్యూహం.. బిజెపి లిస్ట్ రిలీజ్.. ఆ వెంటనే మంత్రుల అరెస్ట్..!
తమిళనాడు.. తమిళ పార్టీలకు తప్ప పెద్దగా కలిసిరాని రాష్ట్రం.. ఇంకా చెప్పాలంటే శతాధిక రాజకీయ పార్టీలున్న ఏకైక రాష్ట్రం కూడా.. ఒక్కో కూటమిలో డజను కంటే పార్టీలు కలిసి పోటీ చేస్తుంటాయి.. తమిళ వాదం బలంగా ఉన్న ఇక్కడ పాగా వేసేందుకు బిజెపి చేయని ప్రయత్నం లేదు.. దివంగత జయలలిత మరణాంతర పరిణామాలను తమకు

తమిళనాడు.. తమిళ పార్టీలకు తప్ప పెద్దగా కలిసిరాని రాష్ట్రం.. ఇంకా చెప్పాలంటే శతాధిక రాజకీయ పార్టీలున్న ఏకైక రాష్ట్రం కూడా.. ఒక్కో కూటమిలో డజను కంటే పార్టీలు కలిసి పోటీ చేస్తుంటాయి.. తమిళ వాదం బలంగా ఉన్న ఇక్కడ పాగా వేసేందుకు బిజెపి చేయని ప్రయత్నం లేదు.. దివంగత జయలలిత మరణాంతర పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుంది భారతీయ జనతా పార్టీ.. అప్పటిదాకా జయలలిత తర్వాత అన్నీ తానై నడిపిన చిన్నమ్మగా పిలవబడే శశికళ సీఎం అయ్యేందుకు ఏర్పాట్లు జరిగినా చివరి నిముషంలో అది జరగలేదు.. అప్పటికే సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ను కాదని శశికళ ఎడపాడి పలనీ స్వామిని సీఎం చేసింది.. శశికళ సీఎం కాకుండా బిజెపి వ్యూహం ఉందన్న ప్రచారం కూడా జరిగింది.. కారణం అమ్మలేని ఎడిఎంకే ని తమకు కావాల్సినట్లుగా ఉపయోగించుకుంది అన్న మాట తమిళనాట బాగా వినిపించింది.. ఈపీఎస్, ఓపిఎస్ మధ్య తలెత్తిన విభేదాల్లో పెద్దన్న పాత్ర పోషించిన బిజెపి రాజ్యసభలో తమకు అనుకూలంగా ఉపయోగించుకుంది.. అయితే తమిళనాడులో పాగా వేయాలన్న స్కెచ్ తో ఎడిఎంకే తో కలిసి ముందుకు వెళ్లాలన్న వ్యూహంలో ఉంది బిజెపి.
రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ లో తమిళనాడు నుంచి తమ పార్టీ సభ్యుల సంఖ్య సగానికి పైగా ఉండాలనేది టార్గెట్ గా ఉందట.. తమిళనాడు 39, పుదుచ్చేరి 1 కలుపుకుని 40 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలవలనేది టార్గెట్.. ఎడిఎంకే ఎలాగూ తమతో ఉంటుంది.. ఇక బలంగా ఉన్న డీఎంకే ని ఢీకొట్టాలానేది బిజెపి ప్లాన్.. తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామలై దూకుడు డీఎంకే నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.. డీఎంకే నేతల అక్రమాలు అంటూ సీజన్..1 సీజన్ 2 అంటూ అక్రమార్కుల జాబితా మీడియాకు రిలీజ్ చేస్తున్నారు.. ఇందులో సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉండడం గమనార్హం.. ఇలా అన్నామలై లిస్ట్ విడుదల చేస్తూపోతూ ఉంటే ఐటి, ఈడీ అధికారులు అలా సోదాలు మొదలు పెడుతూ ఉన్నారు.. ఆతర్వాత అరెస్టులు చేస్తూ ఉన్నారు.. అన్నామలై విడుదల చేసిన జాబితాలో ఆరోగ్య శాఖమంత్రి త్యాగరాజన్ స్టాలిన్ అల్లుడు సబరీశన్ తో మాట్లాడిన ఆడియో.. లావాదేవీలకు సంబంధించిన వివరాలను బయట పెట్టారు. మంత్రి సెంథిల్ బాలాజీ, ఆ వెంటనే మరో మంత్రి పొన్ముడి, అతని కుమారుడు ఎంపి శిగామని లపై ఐటి, ఈడీ దాడులు చేయడం.. ఇప్పటికే సెంథిల్ బాలాజీ అరెస్టు.. త్వరలో మరికొన్ని అరెస్టులు తప్పేలా లేవు.
ఇప్పటివరకు బిజెపిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసి బయటపెట్టిన లిస్ట్ లోని నేతలందరూ డీఎంకేలో అత్యంత ముఖ్యనేతలే. ఆర్ధికంగా పార్టీకి అన్ని విధాలా అండగా ఉండే నేతలే ఇలా టార్గెట్ కావడం డీఎంకే లో కూడా కలవరం రేపుతోంది. అయితే డీఎంకే మాత్రం బిజెపి అనుకున్నవి జరగవు అంటూనే ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తారోనని ఆందోళనలో ఉంది. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిది స్టాలిన్ మాత్రం దీనిపై ఘాటుగానే స్పందించారు. ‘బిజెపి నెక్ట్ టార్గెట్ నేనే.. నాకది అర్ధమవుతోంది.. అయినా నేను భయపడను.. రండి చూసుకుందాం.. నా అడ్రెస్ కూడా ఇస్తా అక్కడే ఉంటా’ అంటూ సవాల్ విసిరారు. నిజంగానే బిజెపి డిఎంకెని టార్గెట్ చేసిందా.. డీఎంకే బిజెపి ట్రాప్ లో చిక్కుకుంటుందా.. వచ్చే ఎన్నికల్లో ఎవరి వ్యూహం ఫలిస్తుంది.. చూడాల్సివుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..