AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suriya: రాజకీయాల్లోకి నటుడు సూర్య..! తమిళనాడులో వెలసిన పోస్టర్లు..

Actor Suriya: సినీ పరిశ్రమను రాజకీయాలను వేరు చేసి చూడలేం.. అందులోనూ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో ఇది కాస్త ఎక్కువే.. దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ మొదలు.. కరుణానిధి, జయలలిత కూడా సినీ నేపధ్యం ఉన్నవారే.. ఈ ముగ్గురూ దశాబ్దాలుగా..

Actor Suriya: రాజకీయాల్లోకి నటుడు సూర్య..! తమిళనాడులో వెలసిన పోస్టర్లు..
Suriya's Posters
Ch Murali
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 23, 2023 | 8:06 AM

Share

Actor Suriya: సినీ పరిశ్రమను రాజకీయాలను వేరు చేసి చూడలేం.. అందులోనూ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో ఇది కాస్త ఎక్కువే.. దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ మొదలు.. కరుణానిధి, జయలలిత కూడా సినీ నేపధ్యం ఉన్నవారే.. ఈ ముగ్గురూ దశాబ్దాలుగా తమిళనాడును పాలించారు.. దేశంలోనే ప్రభావితం చూపిన ముఖ్యమంత్రులుగా గుర్తింపు పొందారు.. ఆ తర్వాత విజయ్ కాంత్, కమలహాసన్..ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు.. విజయ్ కాంత్ తొలుత 2006 లో ఒకే ఒక్కడు గెలవగా.. ఆతర్వాత 2011 ఎన్నికల్లో 29 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచారు.. వర్తమాన నటుల్లో ఇంకా మరికొందరు రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు.

అయితే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం పై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది.. కానీ రజని రాజకీయాల్లోకి రాలేదు.. తమిళనాట సినీ హీరోలంటే ఉన్న క్రేజే వేరు.. ఇక వర్తమాన హీరోలు. విజయ్, సూర్య లు కూడా రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ ఉండనే ఉంది.. మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు విజయ్, సూర్య.. నటుడు సూర్య సీనియర్ నటుడు శివకుమార్ కుమారుడు..సూర్య అగరం ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసే రెండు దశాబ్దాలుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.. నిజమైన లబ్ధిదారులకు సాయం అందించడంలో అగరం ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ నేపథ్యంలోనే సూర్య రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతుండగా ఇపుడు ఆ సమయం వచ్చేసిందన్న చర్చ జరుగుతోంది.. చర్చే కాదు తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. నటుడు సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారని .. నిర్ణయం జరిగిందని.. త్వరలోనే ముహూర్తం ఉందని అభిమానులు పోస్టర్లు వేశారు. అయితే పొలిటికల్ ఎంట్రీపై సూర్య ఇంకా స్పందించలేదు. త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సూర్య పొలిటికల్ ఎంట్రీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంట్రీ ఉంటుందా.. ఉంటే ఎప్పుడు.. ఏ పార్టీ అనేది సూర్య చెప్పాల్సివుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..