Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cybercrime Wire: డ్రాగన్ కంట్రీ కంత్రీపని .. తమ పౌరులపైనే నిఘా.. సిగరెట్ తాగినా పాయింట్లు కట్..

ప్రపంచంలోని అనేక దేశాలు చైనాలోని ఈ సోషల్ క్రెడిట్ సిస్టమ్ గురించి వెల్లడించాయి. ఇది అక్కడ ప్రతి పౌరుడి జీవితం క్రెడిట్ పాయింట్లపై ఆధారపడి ఉందని.. వారి సామాజిక క్రెడిట్ పాయింట్లు తగ్గిపోవచ్చని  చైనా పౌరులు భయపడుతున్నారని చెబుతున్నారు. 2014లో చైనా సోషల్ క్రెడిట్ సిస్టమ్ విడుదల చేయగా.. మర్నాడు అంటే 2015 లో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఈ విషయం గురించి సమాచారాన్ని ఇచ్చింది.

Cybercrime Wire: డ్రాగన్ కంట్రీ కంత్రీపని .. తమ పౌరులపైనే నిఘా.. సిగరెట్ తాగినా పాయింట్లు కట్..
China Privacy
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2023 | 10:49 AM

ప్రపంచంలోని అనేక దేశాలు చైనాపై గూఢచర్యం, హ్యాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. జిన్‌పింగ్ ప్రభుత్వం తన దేశ ప్రజలపై కూడా గూఢచర్యం చేస్తోందని మీకు తెలుసా దీని కోసం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం తన పౌరులందరినీ పర్యవేక్షించే సోషల్ క్రెడిట్ సిస్టమ్ (SCS)ని సిద్ధం చేసింది. ఈ వ్యవస్థను మొదట 2014లో చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవస్థ ఆధారంగా చైనా తన ప్రతి పౌరుడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అనంతరం ప్రతి పౌరుడికి పాయింట్లు ఇస్తారు. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా నేరం చేసినా అతడికి పాయింట్లు తగ్గుతాయి. పాయింట్ చాలా తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ఆంక్ష విధించే అవకాశం కూడా ఉంది.

సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే? ప్రపంచంలోని అనేక దేశాలు చైనాలోని ఈ సోషల్ క్రెడిట్ సిస్టమ్ గురించి వెల్లడించాయి. ఇది అక్కడ ప్రతి పౌరుడి జీవితం క్రెడిట్ పాయింట్లపై ఆధారపడి ఉందని.. వారి సామాజిక క్రెడిట్ పాయింట్లు తగ్గిపోవచ్చని  చైనా పౌరులు భయపడుతున్నారని చెబుతున్నారు. 2014లో చైనా సోషల్ క్రెడిట్ సిస్టమ్ విడుదల చేయగా.. మర్నాడు అంటే 2015 లో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఈ విషయం గురించి సమాచారాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఈ సమాచారం ప్రపంచంలో వేగంగా వ్యాపించడం ప్రారంభించింది.

ప్రస్తుతం చైనా తన దేశ ఆర్థిక వ్యవస్థను ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలనుకుంటోంది. ఇప్పటి వరకు చైనా తన వస్తువులను విక్రయించే దేశాలపై ఆధారపడి ఉంది.. అయితే ఎప్పుడైనా ఏదైనా పరిస్థితిలో ఈ దేశాలు తమ వస్తువులను కొనడం మానేస్తే అప్పుడు తమ దేశంలోని ఫ్యాక్టరీలు మూసివేయాల్సి వస్తాయి. కనుక చైనా దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పెంచాల్సి ఉంటుంది. అప్పుడు వస్తువుల ఎగుమతులపై ఆధారపడాల్సి ఉండదు. ఇందుకోసం తమ దేశ ప్రజల వద్ద డబ్బు అవసరం. అంతేకాదు ప్రజలు సులభంగా రుణాలు పొందడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

2014 వరకు చైనీస్ బ్యాంకులు ప్రజల క్రెడిట్ సిస్టమ్‌ను సులభంగా గుర్తించడానికి ఎటువంటి వ్యవస్థను కలిగి లేవు. అయితే గత సంవత్సరం చివరి నాటికి ప్రజలు అక్కడ చెల్లింపు వ్యవస్థ WeChat యాప్‌ని ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ యాప్ డేటాను ఎందుకు ఉపయోగించకూడదని చైనా ప్రభుత్వం భావించింది. అప్పటి నుండి ప్రజల డేటా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉపయోగించడం ప్రారంభించారు. అంతేకాదు అక్కడి ప్రభుత్వ దరఖాస్తుల్లో చైనా సమాజం మధ్య నమ్మకాన్నిపెంచేలా ఉంది. దీంతో పాటు అక్కడి కంపెనీలకు క్రెడిట్ సిస్టం కూడా సిద్ధం చేసి అందులో కంపెనీ ప్రజలను మోసం చేస్తే బ్లాక్ లిస్ట్ అయ్యేలా పాయింట్లు తగ్గించాలని సూచించింది.

సిగరెట్ తాగితే తగ్గే పాయింట్లు  ఒక వ్యక్తి రోజుకు 5 సిగరెట్లు తాగితే ఆ వ్యక్తికి 3 పాయింట్లు తగ్గించనున్నారు. అయితే ఎవరైనా ఒక రోజులో 10,000 అడుగులు నడిస్తే అతని పాయింట్లు కొన్ని పెరుగుతాయి. నగరాల్లో ఇలాంటి కొన్ని నియమాలు అమలు చేశారు. అయితే ఈ విషయాలను తెలుసుకోవడానికి ప్రజల వద్ద ఎటువంటి మాడ్యూల్ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నాడో చైనా ప్రభుత్వం ఎలా తెలుసుకుంటుందంటే..

చాలా నగరాల్లో ఈ విచిత్రమైన నిబంధనలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం దేశంలోని చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలని చెప్పింది. దీనితో పాటు బ్లాక్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఒకే జాబితాను రూపొందించినట్లు పేర్కొంది. ఈ లిస్ట్ ను సాధారణ ప్రజలు చూడవచ్చు. ప్రభుత్వం బ్యాంకులకు సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత రుణం తీసుకునే ముందు ప్రజలు తమ క్రెడిట్ స్కోర్ ను సులభంగా చూడవచ్చు.

ఇది కోవిడ్ సమయంలో కూడా ఉపయోగించబడింది చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఆ  సమయంలో అక్కడి ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా నిరసనకు ప్రజలను అనుమతించింది. అయితే మర్నాడు పోలీసులు నిరసనకారుల ఇంటికి చేరుకుని, అందులో వారి ప్రమేయానికి సమాధానం చెప్పాలని కోరారు. అనేకాదు అప్పుడు కొంతమందిని బహిష్కరించారు. వారి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.

సామాజిక క్రెడిట్ వ్యవస్థ కాకుండా చైనా తన పౌరులను నియంత్రణలో ఉంచుకునేందుకు ఇటువంటి అనేక పద్ధతులను ఏర్పాటు చేసుకుంది. ఉయ్గర్ ముస్లింలపై నిఘా ఉంచేందుకు చైనా AI, మెషీన్ లెర్నింగ్ పద్ధతులను ఆశ్రయించింది. దీని సహాయంతో ఉయ్ఘర్ ముస్లిం ఎక్కడ ఎన్నా.. ఎటువంటి భూభాగంలో ఉన్నా డ్రాగన్ ప్రభుత్వం సులభంగా గుర్తించగలదు.

క్రెడిట్ సిస్టమ్ వలన ఏర్పడే ప్రమాదాలు: 1: పెరిగిన నిఘా.. వ్యక్తుల నియంత్రణ.

2: తక్కువ సామాజిక క్రెడిట్ స్కోర్లు ఉన్న వ్యక్తుల పట్ల వివక్ష.

3: ప్రభుత్వం వ్యవస్థను దుర్వినియోగం చేయడం.

4: భావప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతిపై చెడు ప్రభావం.

చైనా సామాజిక క్రెడిట్ వ్యవస్థ తక్కువ రాబడి, అధిక నష్టాలతో కూడిన సంక్లిష్టమైన.. వివాదాస్పద వ్యవస్థ. ఎందుకంటే చైనా ప్రభుత్వం తమ ప్రతి కదలికను గమనిస్తోందని కూడా అక్కడి ప్రజలకు తెలియదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..