S20-G20 Summit: ఈషా యోగా కేంద్రం సరికొత్త గుర్తింపును తెస్తుంది.. సైన్స్ శిఖరాగ్ర సమావేశంలో G20 ప్రతినిధులు..
Isha Yoga Center - G20 Summit: G20 సైన్స్-20 శిఖరాగ్ర సమావేశం కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగింది. ఈ సైన్స్ - 20 శిఖరాగ్ర సమావేశానికి గ్రూప్ ఆఫ్ 20 సభ్య దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Isha Yoga Center – G20 Summit: G20 సైన్స్-20 శిఖరాగ్ర సమావేశం కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగింది. ఈ సైన్స్ – 20 శిఖరాగ్ర సమావేశానికి గ్రూప్ ఆఫ్ 20 సభ్య దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జూలై 21 నుంచి జూలై 22, 2023 వరకు నిర్వహించిన ఈ ఈవెంట్‌లో దాదాపు 35 మంది విదేశీ ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత సంస్థల నుంచి 65 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రీనర్ ఫ్యూచర్ కోసం స్వచ్ఛమైన శక్తి, యూనివర్సల్ హోలిస్టిక్ హెల్త్, సైన్స్‌ను సమాజం – సంస్కృతికి అనుసంధానించడం అనే అంశాలపై సుధీర్గంగా చర్చించారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రాయల్ సొసైటీ -యునైటెడ్ కింగ్‌డమ్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ USA, ఇంటర్నేషనల్ సైన్స్ కౌన్సిల్ – ఫ్రాన్స్; CERN – స్విట్జర్లాండ్; ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ తదితర సంస్థల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైన్స్ 20 ప్రతినిధుల కోసం ఈశా కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈశా కేంద్రంలో భారతీయ సంస్కృతి, యోగ సంప్రదాయాలకు సంబంధించిన ప్రదర్శనను నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు వారితో ప్రత్యేకంగా సంభాషించారు. “శాస్త్రీయ పురోగతి, సాంకేతిక పురోగమనం పట్ల మన నిబద్ధతలో మనల్ని మనం ఆనందంగా, కలుపుకొనిపోయే మానవులుగా తీర్చిదిద్దుకోవడం ఒక ముఖ్యమైన దశ.. మన గ్రహం గమనాన్ని మార్చడానికి ఇది అవసరం, భిన్నమైన ఆలోచనలతో అన్నీ సాధించవచ్చు” అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటరాక్టివ్ సెషన్‌లో సద్గురు మాట్లాడూ.. జీవన విధానం అత్యుత్తమంగా ఉండేలా ప్రణాళికలు చేయాలని.. సైన్స్ ను ప్రకృతితో అనుసంధించాలని పేర్కొన్నారు.
ఈ రోజుల్లో డ్రై సైన్స్ పాత పద్ధతిలో దాని పరిమితులను కలిగి ఉందని.. సైన్స్ గురించి సంకుచితంగా కాకుండా సాధారణంగా జీవితం గురించి ఆలోచించడానికి, మరింత విస్తృతమైన విషయాలపై అవగాహన అవసరం అని.. కావున సైన్స్ 20 సమావేశాన్ని ఇషా ఆశ్రమంలో నిర్వహించామని భారత ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు శ్రీ సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. సమ్మిట్‌లో సైన్స్ ఆఫ్ యోగాపై కూడా సెషన్ నిర్వహించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, అనస్థీషియాలజీ ప్రొఫెసర్, సద్గురు సెంటర్ ఫర్ ఎ కాన్షియస్ ప్లానెట్ డైరెక్టర్ డాక్టర్. బాల సుబ్రమణ్యం ఆధ్యాత్మికత – యోగా గురించి పలు ఆసక్తికర విషయాలను విదేశీ ప్రతినిధులకు వివరించారు.
కాగా.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్మాత్మికత ప్రతిబింభించేలా పలు కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇషా విద్యార్థులు భారతీయ శాస్త్రీయ యుద్ధ కళలు – కలరిపయట్టు – శాస్త్రీయ భారతీయ నృత్యం – భరతనాట్యం – సాంప్రదాయ ఎద్దుల బండ్లపై ప్రయాణం, సెంటర్‌లోని పవిత్ర స్థలాల సందర్శన లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రముగ్ధులైన విదేశీ ప్రతినిధులు.. ఈషా యోగా కేంద్రం భారతదేశానికి కొత్త అభిప్రాయాన్ని తెస్తుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ చాలా విషయాలు సంస్కృతి.. ఆధ్యాత్మికత, సైన్స్ కు పెనవేసుకున్నాయని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..