AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanvapi mosque: ఎట్టకేలకు జ్ఞానవాపి మసీద్‌లో మొదలైన ఆర్కియాలాజికల్ సర్వే.. నివేదికపై ఉత్కంఠ

ఈ మధ్య వివాదస్పదంగా మారిన జ్ఞానవాపి మసీద్‌లో ఎట్టకేలకు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వే ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచి అధికారులు ఆ సర్వే చేపట్టనున్నారని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. ముందుగా పోలీసులు బృందం ఆ మసీదులోపలికి ప్రవేశించారు.

Gyanvapi mosque: ఎట్టకేలకు జ్ఞానవాపి మసీద్‌లో మొదలైన ఆర్కియాలాజికల్ సర్వే.. నివేదికపై ఉత్కంఠ
Gyanvapi Mosque
Aravind B
|

Updated on: Jul 24, 2023 | 9:00 AM

Share

ఈ మధ్య వివాదస్పదంగా మారిన జ్ఞానవాపి మసీద్‌లో ఎట్టకేలకు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వే ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచి అధికారులు ఆ సర్వే చేపట్టనున్నారని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. ముందుగా పోలీసులు బృందం ఆ మసీదులోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత అర్కియాలజికల్ అధికారులు అక్కడికి వచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీల్ వేసినటువంటి ప్రాంతాన్ని మాత్రం ప్రస్తుతం చేపడుతున్న సర్వే నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఇటీవల వాజుఖానా ఆకారం బయటపడటంతో అది శివలింగమని హిందు సంఘాలు వాదించాయి. అయితే మసీది కమిటీ అది నీటి కొలను నిర్మాణమని వాదించింది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పరస్పర వాదనలు, విమర్శలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక కోర్టు వెంటనే సర్వే చేపట్టాలంటూ పురావస్తు శాఖకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వేను పూర్తి చేసి ఆగస్టు 4వ తేదిన జిల్లా కోర్టుకు అర్కియలాజికల్ అధికారులు తమ నివేదికను అందించనున్నారు. ఇదిలా ఉండగా శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటి సుప్రీంకోర్టును ఆశ్రయించి వెంటనే విచారణ చేపట్టాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌ సోమవారం చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?