దారుణం.. భోజనం వడ్డించలేదని భార్యను చంపిన భర్త
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య అన్నం వడ్డించలేదన్న కోపంతో భర్త బండరాయితో కొట్టి చంపడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రమేశ్ బేనివాల్ (35), సుమన్ బేనివాల్ అనే దంపతులకు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య అన్నం వడ్డించలేదన్న కోపంతో భర్త బండరాయితో కొట్టి చంపడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రమేశ్ బేనివాల్ (35), సుమన్ బేనివాల్ అనే దంపతులకు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రమేష్ ఒక వ్యాపారి. వృత్తిరిత్యా తరచుగా జోధ్‌పూర్‌కు వెళ్లి వస్తుంటాడు. అయితే గత శనివారం రాత్రి రమేశ్ ఎప్పట్లాగే జోధ్‌పుర్ వెళ్లాడు. అయితే ఇంటికి రాత్రి ఆలస్యంగా వచ్చాడు. భార్యను భోజనం వడ్డించమని అడగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో రమేశ్ కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న బండరాయితో ఆమె తలపై బాదాడు. ఆ రాయి తలకు బలంగా తగలడంతో అతడి భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత రమేశ్.. తన బావమరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతను తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు రమేశ్ ఇంటికి వచ్చేవరకు తన భార్య మృతదేహం వద్దే కూర్చుని ఉన్నాడు. చివరికి పోలీసులను అతడ్ని అరెస్టు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.