Telangana: ఆపరేషన్‌ లోటస్‌.. త్వరలో BJPలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు..! టీవీ9 బ్లాస్టింగ్ న్యూస్‌

Telangana BJP: తుఫాన్‌ హెచ్చరిక.. అంటే.. ఇది పొలిటికల్ తుఫాన్ హెచ్చరిక.. ఈ తుఫాన్‌ ఏం తీరంవైపు వెళ్తోంది.. ఎవర్ని అతలాకుతలం చేయబోతోంది.. ఇదే ఇప్పుడు టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో అతిత్వరలో చాలా కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.

Telangana: ఆపరేషన్‌ లోటస్‌.. త్వరలో BJPలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు..! టీవీ9 బ్లాస్టింగ్ న్యూస్‌
Telangana Politics
Follow us
Shaik Madar Saheb

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 23, 2023 | 6:50 PM

Telangana BJP: తుఫాన్‌ హెచ్చరిక.. అంటే.. ఇది పొలిటికల్ తుఫాన్ హెచ్చరిక.. ఈ తుఫాన్‌ ఏం తీరంవైపు వెళ్తోంది.. ఎవర్ని అతలాకుతలం చేయబోతోంది.. ఇదే ఇప్పుడు టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో అతిత్వరలో చాలా కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. భారతీయ జనతా పార్టీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన బ్లాస్టింగ్‌ న్యూస్‌ టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది. తెలంగాణలో రాజకీయ వలసలపై టీవీ9 బ్లాస్టింగ్ న్యూస్‌.. త్వరలో BJPలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు రానున్నాయి. శ్రావణమాసంలో చేరికలకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం.. ఈ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో మాజీ ముఖ్యమంత్రిదే కీరోల్‌..? 3 దశల్లో చేరికలు.. ప్రత్యర్థులకు చెక్‌ పెట్టే వ్యూహాలు..కొందరు సిట్టింగ్‌లూ బీజేపీవైపు చూస్తున్నారని లీకులు.. ఓ ముఖ్యనేతకు టచ్‌లో కాంగ్రెస్‌, BRS అసంతృప్తులు..

ఇంతకీ ఆ 15 మంది ఎవరు.. కాంగ్రెస్ వాళ్లా.. BRS వాళ్లా….. BJP నుంచి వాళ్లకు వచ్చిన హామీ ఏంటి.. ఇప్పటికే తాము పార్టీ మారతామనే సంకేతాలు ఆ లీడర్లు ఆయా పార్టీల హైకమాండ్‌కి ఇచ్చారా.. అతి త్వరలో ఈ వివరాలన్నీ బయటకు రాబోతున్నాయి. ఒకట్రెండు చోట్ల ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే సూచనలు ఉన్నాయి.. పార్టీ మారబోతున్న నేతలు టికెట్‌పై హామీ ఇచ్చాకే.. కండువా మార్చబోతున్నారు.. ఈ లిస్ట్‌లో కొందరు ముఖ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, యాక్షన్ ప్లాన్‌పై సునీల్‌ బన్సల్‌కు ముఖ్యనేతల సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 100 రోజుల ప్రణాళికతో దూకుడు పెంచబోతున్న బీజేపీ.. బీఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేననేలా స్పీడు పెంచింది. దీనిలో భాగంగా బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని కీలక నేతలు ధీమా వ్యక్తంచేస్తుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..