Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lectrix EV Scooter: ఎథర్‌, ఓలాకు పోటీగా మార్కెట్‌లోకి నయా ఈవీ స్కూటర్‌.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!

ప్రస్తుతం ఈవీ వాహనాల్లో ఓలా, ఎథర్‌, టీవీఎస్‌ తమ హవా చూపుతున్నాయి. అయితే తాజాగా ఈ స్కూటర్లకు పోటీనిచ్చేలా ఓ కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ ప్రకటించింది. భారతదేశంలో ఈ కంపెనీ ఇప్పటికే లుమినస్‌, లివ్‌గార్డ్‌, లివ్‌ఫాస్ట్‌, లివ్‌ ప్యూర్‌ వంటి బ్రాండ్స్‌ నిర్వహిస్తుంది.

Lectrix EV Scooter: ఎథర్‌, ఓలాకు పోటీగా మార్కెట్‌లోకి నయా ఈవీ స్కూటర్‌.. ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!
Ev
Follow us
Srinu

|

Updated on: Jul 24, 2023 | 6:15 AM

భారతదేశంలో పెరుగుతున్న ఈవీ మార్కెట్‌లో తమ మోడల్స్‌తో వినియోగదారులను ఆ‍కట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఈవీ వాహనాల్లో ఓలా, ఎథర్‌, టీవీఎస్‌ తమ హవా చూపుతున్నాయి. అయితే తాజాగా ఈ స్కూటర్లకు పోటీనిచ్చేలా ఓ కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ ప్రకటించింది. భారతదేశంలో ఈ కంపెనీ ఇప్పటికే లుమినస్‌, లివ్‌గార్డ్‌, లివ్‌ఫాస్ట్‌, లివ్‌ ప్యూర్‌ వంటి బ్రాండ్స్‌ నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ కంపెనీ గృహ అవసరాలతో పాటు  పెట్రో వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీలను రూపొందిస్తుంది. అయితే తాజాగా ఈ కంపెనీ కూడా కొత్త ఈవీని లాంచ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు నెల ప్రారంభంలో ఈ కంపెనీ తన స్కూటర్‌ లాంచ్‌ చేస్తుంది మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. లెక్ట్రిస్‌ పేరుతో రిలీజ్‌ చేస్తున్న ఈ స్కూటర్‌ ద్వారా ఈవీ మార్కెట్‌లో తన హవా చూపాలని ఏఎస్‌ఆర్‌ గ్రూప్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాబట్టి ఈ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

లెక్ట్రిక్స్‌ స్కూటర్‌కు సంబంధించి ఆగస్టు నెలలో బుకింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ స్కూటర్‌ ధర రూ.1 లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్కూటర్‌ డిజైన్‌పరంగా కూడా ఇతర ఈవీ స్కూటర్‌ను పోలి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ స్కూటర్‌ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ ఈవీ స్కూటర్‌గా ఉంటుంది. అయితే ఈ స్కూటర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌లతో చాలా ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా లెక్ట్రిక్స్‌ ఈవీ స్కూటర్‌లో ఎమర్జెన్సీ అసిస్ట్‌ ఫీచర్లు, స్మార్ట్‌ ఇగ్నిషన్‌, ఆటో కన్సెలింగ్‌ ఇండికేటర్‌తో వస్తుందని భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ స్కూటర్‌ బ్లూటూత్‌ కనెక్టవిటీతో నావిగేషన్‌ ఫీచర్‌తో వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్‌ఏఆర్‌ కంపెనీ ఈ స్కూటర్‌కు చాలా కఠిన పరీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా ఈ స్కూటర్‌తో 1.25 లక్షల కిలో మీటర్ల పైగా పరీక్షించిందని తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే 100 కిలో మీటర్ల రేంజ్‌ వచ్చేలా డిజైన్‌ చేసి ఉంటారని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి ముఖ్యంగా థర్మల్‌ పవర్‌ను ఆప్టిమైజ్‌ చేయడానికి ఈ-స్కూటర్‌ బ్యాటరీ నిర్వహణ బీఎంఎస్‌కు సంబంధించిన వివరాలను కూడా కంపెనీ ఇవ్వనుంది. ముఖ్యంగా బ్యాటరీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ స్కూటర్‌ స్వయం చాలకంగా వేగాన్ని తగ్గిస్తుంది. అధునాతన ఫీచర్లతో వచ్చే ఈ లెక్ట్రిక్స్‌ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ యాప్‌ల చుట్టూ స్కామర్లు.. డౌన్లోడ్ చేస్తే డబ్బులు మాయం
ఈ యాప్‌ల చుట్టూ స్కామర్లు.. డౌన్లోడ్ చేస్తే డబ్బులు మాయం
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే