Fisker Electric SUV: దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.. అడాస్ ఫీచర్లతో పిచ్చెక్కిస్తున్న ఎస్‌యూవీ..
ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఫిస్కర్ ఐఎన్సీ భారతదేశంలో ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాదే దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసింది. మన హైదరాబాద్ లో ఓ యూనిట్ ను కూడా ప్రారంభించింది.

మన దేశంలో కూడా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇక్కడ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వీటిల్లో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉంటున్నాయి. ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఫిస్కర్ ఐఎన్సీ భారతదేశంలో ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాదే దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసింది. మన హైదరాబాద్ లో ఓ యూనిట్ ను కూడా ప్రారంభించింది. అయితే మొదటిగా 100 యూనిట్ల మేర పరిమిత విజ్ఞాన్ ఎడిషన్ ఫిస్కర్ ఓషన్ ఎస్‌యూవీని అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పేరును మొట్టమొదటి ఇండియా అవుట్ పోస్ట్ నుంచి స్వీకరించారు. ఈ ఫిస్కర్ ఓషన్ లగ్జరీ కారు సింగిల్ చార్జ్ పై ఏకంగా 707 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫిస్కర్ ఓషన్ ధర, లభ్యత..
ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర జర్మనీలో €69,950గా ఉంది. మన భారతదేశంలోని ఇది దాదాపు రూ. 64.5 లక్షలు అవుతుందని చెబుతున్నారు. అయితే, పన్నులు, లాజిస్టిక్స్‌తో, ఈ ధర చాలా సులభంగా రూ. 1 కోటికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫిస్కర్ ఓషన్ ఎస్‌యూవీ సెప్టెంబరు నాటికి భారతీయ అధికారుల నుంచి హోమోలోగేషన్‌ను పొందుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగే 2023 చివరి క్వార్టర్ ఈ ఈవీ డెలివరీలు ప్రారంభమవుతాయి. ఫిస్కర్ ఓషన్ భారతదేశంలోని బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి ఇ-ట్రాన్, జాగ్వార్ ఐ-పేస్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.
ఫిస్కర్ ఓషన్ ఎస్‌యూవీ వివరాలు..
మోటార్ సామర్థ్యం.. ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 572 హెచ్పీ, 737ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
రేంజ్.. ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక ఛార్జ్‌పై 707కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
స్పీడ్ కార్.. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు 4 సెకన్లలోనే సున్నా నుంచి గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది.
పూర్తి పర్యావరణ హితం.. దీనిలో పూర్తి పర్యావరణ హితమైన ఇంటీరియర్స్, రీజెనరేటెడ్ నైలాన్ నుంచి తీసుకోబడిన రీసైకిల్ కార్పెట్‌లు, రీసైకిల్ చేసిన రబ్బరు, పైకప్పుపై సోలార్ ప్లేట్లు అమర్చారు.
అత్యాధునిక ఫీచర్లు.. ఈ కారులో 17.1-అంగుళాల రివాల్వింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కెమెరా-ఆధారిత రియర్-వ్యూ మిర్రర్, పవర్డ్ టెయిల్‌గేట్, 3డీ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్, రియర్ హీటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరాలు, అడాస్ ఫీచర్లు, వివిధ డ్రైవ్‌ల మోడ్‌లు ఉన్నాయి.
వేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి..
భారతదేశంలో బ్యాటరీ, వాహనాల అసెంబ్లీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగలిగితే, భవిష్యత్తులో తన పోర్ట్‌ఫోలియో నుండి ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర తగ్గే అవకాశం ఉంటుంది. దీని కోసం కంపెనీ ప్రభుత్వ సహాయాన్ని కోరే అవకాశం ఉంది. ఈ అంశంపై కంపెనీ సీఈఓ హెన్రిక్ ఫిస్కర్ మాట్లాడుతూ, “భారతదేశం మాకు ఉత్తేజకరమైన అవకాశాలను అందిస్తుంది, రాబోయే సంవత్సరాల్లో మా బ్రాండ్‌ను వేగంగా అభివృద్ధి చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము.” అని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..