AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Mistakes: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైల్‌ చేసే సమయంలో ఆ తప్పు చేశారా? ఈ టిప్స్‌ సరి చేయడం చాలా సింపుల్‌..

ముఖ్యంగా ఇన్‌కమ్‌ రిటర్న్స్‌లో ముఖ్య పాత్ర పోషించే బ్యాంక్‌ అకౌంట్‌ వివరాల నమోదు కొంతమంది తప్పుగా ఎంటర్‌ చేస్తున్నారు. అయితే వివరాలు వ్యాలిడేట్‌ అయ్యాక తప్పును ఎలా సరిదిద్దుకోవాలో? తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ గడువు సమీపిస్తున్నందున మీ పన్ను రిటర్న్స్‌ సమర్పించాక ఆదాయపు పన్ను శాఖ మీకు సొమ్ము రిటర్న్‌ చేసే సమయంలో ఈ వివరాలు కీలకంగా మారతాయి.

ITR Mistakes: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైల్‌ చేసే సమయంలో ఆ తప్పు చేశారా? ఈ టిప్స్‌ సరి చేయడం చాలా సింపుల్‌..
Income Tax Filling
Nikhil
|

Updated on: Jul 24, 2023 | 8:00 AM

Share

ప్రస్తుతం భారతదేశంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చే వారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపు హడావుడిలో పడ్డారు. జూలై 31న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపు ఆఖరు తేదీ కావడంతో ట్యాక్స్‌ చెల్లింపునకు ముందుకు వస్తున్నారు. అయితే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపులకు ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో కొన్ని తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కమ్‌ రిటర్న్స్‌లో ముఖ్య పాత్ర పోషించే బ్యాంక్‌ అకౌంట్‌ వివరాల నమోదు కొంతమంది తప్పుగా ఎంటర్‌ చేస్తున్నారు. అయితే వివరాలు వ్యాలిడేట్‌ అయ్యాక తప్పును ఎలా సరిదిద్దుకోవాలో? తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ గడువు సమీపిస్తున్నందున మీ పన్ను రిటర్న్స్‌ సమర్పించాక ఆదాయపు పన్ను శాఖ మీకు సొమ్ము రిటర్న్‌ చేసే సమయంలో ఈ వివరాలు కీలకంగా మారతాయి. కాబట్టి మీ ఐటీఆర్‌ ఫారమ్‌లో తప్పు ఖాతా వివరాలను సరిచేయడానికి మీరు అనుసరించాల్సిన సింపుల్‌ విధానాన్ని ఓ సారి తెలుసుకుందాం. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని ‘ఐటీఆర్ ఫారమ్ పర్టిక్యులర్‌లను మార్చండి’ ఫీచర్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ ఖాతా, చిరునామా, మొబైల్ నంబర్, ఈ -మెయిల్ ఐడీ వంటి వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు. అయితే ఈ వివరాల ఎడిటింగ్‌ ఐటీఆర్‌ ప్రాసెసింగ్‌కు ముందు మాత్రమే ఎవరైనా అభ్యర్థన చేయగలరని గమనించడం ముఖ్యం

ఐటీఆర్‌లో బ్యాంక్‌ వివరాలు సరి చేయండిలా

  • స్టెప్‌- 1: ఆదాయపు పన్ను శాఖ వెబ్‌ సైట్‌లో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
  • స్టెప్‌- 2: పేజీకి ఎగువ ఎడమ వైపున ఉన్న ‘నా ఖాతా’ ట్యాబ్‌కు వెళ్లాలి.
  • స్టెప్‌- 3: ‘నా ఖాతా’ ట్యాబ్ కింద ‘సర్వీస్ రిక్వెస్ట్’ ఎంపికను ఎంచుకోవాలి.
  • స్టెప్‌- 4: ‘అభ్యర్థన రకం’ కింద ‘కొత్త అభ్యర్థన’, ‘అభ్యర్థన వర్గం’ కింద ‘సవరణ’ ఎంచుకోవాలి.
  • స్టెప్‌- 5: అక్కడ ‘ఐటీఆర్ ఫారమ్ పర్టిక్యులర్‌లను మార్చండి’ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • స్టెప్‌- 6: మీ PAN స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.
  • స్టెప్‌- 7: ఐటీఆర్‌ ‘అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్’ వంటి మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • స్టెప్‌- 8: మీరు లాగిన్ చేసిన తర్వాత ‘బ్యాంక్ ఖాతా వివరాలను మార్చడం’, ‘చిరునామా వివరాలను మార్చండి’, ‘ఈ-మెయిల్ ఐడీ/మొబైల్ నంబర్ వివరాలను మార్చండి’ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
  • స్టెప్‌- 9: అవసరమైన ఎంపికను ఎంచుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి, సమర్పించు నొక్కాలి.
  • స్టెప్‌- 10: మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత లావాదేవీ ఐడీ స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.

పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత వారు తమ ఐటీఆర్‌ను మళ్లీ ధ్రువీకరించాలి. ఐటీఆర్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి ‘నా ఖాతా’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, “బ్యాంక్ ఖాతాలు” ఎంచుకోవాలి. అక్కడ అప్‌డేట్ చేయబడిన బ్యాంక్ ఖాతా పక్కన ఉన్న “రీ-వాలిడేట్” బటన్‌పై క్లిక్ చేయాలి. రీ-వాలిడేషన్ తర్వాత ఐటీఆర్‌ ప్రాసెస్ అవుతుంది. అలాగే రీఫండ్ జారీ చేస్తారు. అలాగే ఈ దశలోనే పన్ను చెల్లింపుదారులు వారి ఐటీఆర్‌ ఫారమ్‌లో చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌ను కూడా సరిదిద్దవచ్చు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ తప్పులను సరిదిద్దవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us