AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ather Electric Scooter: ఏథర్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తక్కువ.. ఫీచర్లలో మాత్రం తగ్గేదే లే..

ఏథర్ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన స్కూటర్ గా ఇది నిలువనుంది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ముందుకెళ్తోంది. ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్ లో సింగిల్ చార్జ్ పై 115 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Ather Electric Scooter: ఏథర్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తక్కువ.. ఫీచర్లలో మాత్రం తగ్గేదే లే..
Ather 450 S
Follow us
Madhu

|

Updated on: Jul 13, 2023 | 5:00 PM

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఏథర్ ఎనర్జీ మరో కొత్త ఉత్పత్తిని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కంపెనీ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో లాంచ్ కానుంది. దీనిపై ఏథర్ 450ఎస్. ప్రస్తుతం ఉన్న 450ఎక్స్ వేరియంట్ కు ఇది ప్రతి రూపం అని చెప్పొచ్చు. ఈ కొత్త 450ఎస్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే ప్రకటించింది. ధరను వెల్లడించింది. అధికారికంగా బుకింగ్స్, సేల్స్ వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, రేంజ్, ధర వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఏథర్ 450ఎస్ ధర..

ఏథర్ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన స్కూటర్ గా ఇది నిలువనుంది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ముందుకెళ్తోంది. ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్ లో సింగిల్ చార్జ్ పై 115 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఏథర్ దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయడంతో కొన్ని ఫీచర్లు, లుక్ కూడా రివీల్ అయ్యింది. దీనిలో పోర్టబుల్ ఎల్సీడీ ని అమర్చింది. దీని వల్ల స్కూటర్ ఓవరాల్ ధర తగ్గింది. అయినప్పటికీ ఈ స్కూటర్ కి స్మార్ట్ కనెక్టవిటీ అనేది స్టాండర్డ్ ఫీచర్ గా వస్తోంది.

డిజైన్ లో మార్పు లేదు..

ప్రస్తుతం వస్తున్న 450ఎస్ స్కూటర్ డిజైన్ లో పెద్దగా మార్పు లేదు. ఏథర్ 450ఎక్స్ మాదిరిగానే యూత్ ఫుల్ లుక్ లోనే ఉంటుంది. ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనో షాక్, ముందు వెనుక డిస్క్ బ్రేకులు, బెల్ట్ డ్రైవ్ వంటి వాటిని అలాగే ఉంచారు. అయితే రేంజ్ మాత్రం 450ఎక్స్ కన్నా, దీనిలో తక్కువగా ఉంది కాబట్టి బ్యాటరీ పవర్ ను తగ్గించారు. ఈ 450ఎస్ స్కూటర్లో 3kwh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆ స్కూటర్లకు పోటీ..

ఏథర్ 450ఎస్ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ వంటి స్కూటర్లతో పోటీ పడే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంచుముంచు ఒకటే రేంజ్, ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ కొత్త బైక్ ఏథర్ బ్రాండ్ కు అదనపు ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఏథర్ 450ఎక్స్ స్కూటర్ల మార్కెట్లో తన సత్తా చాటుకుంది. వినియోగదారుల నుంచి ఈ బైక్ కోసం మంచి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు దాని కన్నా తక్కువ ధరలో 450ఎస్ ను తీసుకొస్తుండటంతో దీనిపై సర్వాత్రా ఆసక్తి నెలకొంటోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..