- Telugu News Photo Gallery Tomatoes to get cheaper in Delhi NCR. This is how the government will control the price
Tomato High Prices: టమోటా ధరల నుంచి పెద్ద ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..!
ప్రతి వంటకాల్లో వేసే టమోటా ధర విపరీతంగా పెరిగిపోవడంతో వంటగదిలో టమోటాలు లేకుండా పోతున్నాయి. సామాన్యుడు సైతం కొనలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టమోటా ధరల కాస్త ఉపశమనం కలిగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు ఖరీదైన టమోటాల నుంచి పెద్ద ఉపశమనం పొందబోతున్నారు..
Updated on: Jul 13, 2023 | 4:15 PM

ప్రతి వంటకాల్లో వేసే టమోటా ధర విపరీతంగా పెరిగిపోవడంతో వంటగదిలో టమోటాలు లేకుండా పోతున్నాయి. సామాన్యుడు సైతం కొనలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టమోటా ధరల కాస్త ఉపశమనం కలిగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు ఖరీదైన టమోటాల నుంచి పెద్ద ఉపశమనం పొందబోతున్నారు.

టొమాటో ధరల మంటలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో టమోటాలను రాయితీ ధరలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమోటా కొనుగోలు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి రాయితీ ధరలకు ఢిల్లీ NCR వినియోగదారులకు టమోటాలు విక్రయించబడతాయి. టమాటా రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమోటాలను కొనుగోలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించి, టమోటా ధరలను కట్టడి చేసేందుకు ఎక్కువ వినియోగం ఉన్న పంపిణీ కేంద్రాలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులకు తగ్గింపు ధరలకు టమోటాలు పంపిణీ చేయబడతాయి. నాఫెడ్ ఈ రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేస్తుంది.

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని మండీల నుంచి టమాటాలను వెంటనే కొనుగోలు చేయాలని నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లను వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశించింది. దీంతో పాటు నెల రోజుల్లో ధరలు ఎక్కువగా పెరిగిన చోట్ల పంపిణీ చేయాలని కోరారు. ఈ వారం అంటే జూలై 14, 2023 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా టొమాటోలు వినియోగదారులకు తగ్గింపు ధరలకు విక్రయించనున్నారు.

గత నెలలో దేశం మొత్తం సగటు ధరతో పోలిస్తే ఎక్కడెక్కడ అత్యధిక ధరలకు టమాటా విక్రయిస్తున్నారనే దాని ఆధారంగా చౌక ధరలకు టమాటా విక్రయించే కేంద్రాలను గుర్తించారు. అదే వినియోగం గరిష్టంగా ఉన్న ప్రదేశాలలో టమోటాలు విక్రయించబడతాయి.

Tomatoes




