మరో దారుణం: గ్రీజు అంటిన చేతితో తాకాడనీ.. దళితుడి ముఖంపై మానవ మలం పూశాడు

దళితులపై దాడులు దేశ వ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్నాయి. నాగరికులమనే విషయాన్ని మరచి వారి పట్ల అమానుషంగా దాడులకు దిగుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి..

మరో దారుణం: గ్రీజు అంటిన చేతితో తాకాడనీ.. దళితుడి ముఖంపై మానవ మలం పూశాడు
Victim Dashrath Ahirwar
Follow us

|

Updated on: Jul 24, 2023 | 9:56 AM

భోపాల్‌, జులై 24: దళితులపై దాడులు దేశ వ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్నాయి. నాగరికులమనే విషయాన్ని మరచి వారి పట్ల అమానుషంగా దాడులకు దిగుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి మూత్రవిసర్జన చేయంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. దీనిని మురవక ముందే జాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా గ్రీజ్‌ పూసిన చేతితో తాకాడనీ అగ్ర కులానికి చెందిన ఓ వ్యక్తి దలితుడిపై దారుణానికి పాల్పడ్డాడు. మానవ మలం తీసుకొచ్చి దళితుడి ముఖం, తలపై పూసి కులం పేరుతో దారుణంగా దుర్భాషలాడాడు. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఛతర్‌పూర్‌ పరిధిలోని బికౌరా గ్రామ పంచాయతీకి చెందిన దశరథ్‌ అహిర్వార్‌ అనే వ్యక్తి శుక్రవారం (జులై 21) మురుగుకాల్వ నిర్మాణ పనుల్లో ఉండగా ఈ సంఘటన జరిగింది. అతనికి సమీపంలోని చేతి పంపు వద్ద ఓబీసీ కులానికి చెందిన రామ్‌కృపాల్‌ పటేల్‌ అనే మరో వ్యక్తి స్నానం చేస్తుండగా నిర్మాణ పనుల్లో ఉన్న దశరథ్‌ అహిర్వార్‌ గ్రీజు అంటిన చేతితో పొరపాటున అతన్ని తాకాడు. దీంతో ఆగ్రహించిన నిందితుడు రామ్‌కృపాల్‌ పటేల్‌ సమీపంలోని మానవ మలాన్ని తీసుకొచ్చి బాధితుడిని కులం పేరుతో దూషిస్తూ తల, ముఖంతో సహా శరీరంపై పూశాడు. దీనిపై అహిర్వార్‌ గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై చర్యలు తీసుకోవడానికి బదులు తిరిగి తనపైనే రూ.600 జరిమానా విధించారని అహిర్వార్ పోలీసుల ఎదుట తన గోడు వెల్లవించాడు.

దీంతో బాధితుడు అహిర్వార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు రామ్‌కృపాల్‌ పటేల్‌ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు, బాధితుడు ఇద్దరూ 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులేనని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.