‘మేము భారత్‌తో యుద్ధం కోరుకోవడం లేదు.. ముప్పు ఉంటే, అణ్వాయుధాలు తీస్తాం’: పాక్ రక్షణ మంత్రి
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు సై అంటే సై అనడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు రివెంజ్ పక్కాగా ఉండాల్సందే..! పాక్ లెక్క తేల్చాల్సిందేనంటూ భారతదేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఢిల్లీలో వరుస సమావేశాలు మరింత ఆసక్తిని రెకెత్తిస్తున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు సై అంటే సై అనడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు రివెంజ్ పక్కాగా ఉండాల్సిందే..! పాక్ లెక్క తేల్చాల్సిందేనంటూ భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఢిల్లీలో వరుస సమావేశాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు, భారత త్రివిధ దళాల సన్నద్దమయ్యాయి. ఇంకో వైపు ఉగ్రవాదుల ఏరివేత చురుకుగా సాగుతోంది.
అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం ఈ దాడిని స్వయంగా చేసినట్లు అనిపిస్తోందని, ఈ దాడిలో పాకిస్తాన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. “మేము భారతదేశంతో యుద్ధం ప్రారంభించాలనుకోవడం లేదు, కానీ యుద్ధ పరిస్థితి తలెత్తితే పాకిస్తాన్ కూడా దానికి ప్రతిస్పందిస్తుంది. భారతదేశం నీటిని ఆయుధంగా ఉపయోగిస్తోంది” అని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. “పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉంది. మన ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉంటేనే, తమ అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది” అని ఆసిఫ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం తనపై దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతోంది. అయితే భారతదేశాన్ని కూడా హెచ్చరిస్తూ.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తులో రష్యా, చైనాలను పాలుపంచుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. వార్తా సంస్థ PTI ప్రకారం, రష్యా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న RIA నోవోస్టి వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ సంక్షోభంలో రష్యా, చైనా లేదా పాశ్చాత్య దేశాలు కూడా చాలా సానుకూల పాత్ర పోషించగలవని భావిస్తున్నానన్నారు. వారు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవచ్చన్నారు. దీనికి భారతదేశం అబద్ధం చెబుతోందా? నిజం చెబుతోందా అనే దానిపై దర్యాప్తు చేసే పనిని అప్పగించాలన్నారు. ఇందు కోసం ఒక అంతర్జాతీయ బృందం ఏర్పాటు చేయాలని ఖవాజా కోరారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా అంతర్జాతీయ దర్యాప్తును ప్రతిపాదించారని ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ఇదిలావుంటే, పాకిస్థాన్ ఆర్మీలో తిరుగుబాటు మొదలైంది. పాక్ ఆర్మీ అధికారులు.. జవాన్లు ఒక్కొక్కరిగా రాజీనామాల బాట పట్టారనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే 3వందల మంది అధికారులు, 12 వందల మంది సైనికులు పాక్ ఆర్మీకి గుడ్ బై చెప్పారని వారి రాజీనామాల లేఖలు పబ్లిక్ డొమైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్ తరువాత వేగంగా జరుగుతున్న పరిణామాలు, పాక్ నేతల బాధ్యతారాహిత్య వ్యాఖ్యలే ఆర్మీలు రాజీనామాల వెల్లువకు కారణమనే చర్చ జరుగుతోంది.
పహల్గామ్ ఘటనలో నిందితులు సహా వారి వెనుక వున్న వాళ్లను వదిలేదని భారత్ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ప్రసంగం పాక్‌లో ప్రకంపనలు రేపింది. సింధు నది నీళ్లు బందయ్యాయి. ఏ క్షణానయినా యుద్ధం ఖాయం అన్నట్టుగా బోర్డర్‌లో హైటెన్షన్ కొనసాగుతోంది. అంతర్జాతీయ సమాజం ఛీ కొడుతున్నా సరే.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కయ్యానికి కాలుదు దువ్వుతుంది. ఇలాంటి పోకడలపై పాక్ ఆర్మీలో విభేదాలు రగులుకున్నాయని, విద్వేషపు మాటలతో ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తున్న పాక్ నేతల మాటలకు తామెందుకు ఆహుతి కావాలని పాక్ ఆర్మీలో కొందరు అధికారులు తిరుగుబాటు చేస్తున్నారనే కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే బలూచి లిబరేషన్ ఆర్మీ.. తమపై దాడులు చేస్తుంటే చోద్యం చూసిన పాక్ సర్కార్.. ఇక భారత్ యుద్ధం ప్రకటిస్తే తమను రక్షిస్తుందా? అని ఆర్మీ అధికారులు, జవాన్లు రాజీనామా బాట పడుతున్నారనేది టాక్. అయితే పాక్ ఆర్మీ కానీ,అధికార వర్గాలు కానీ ఇంకా నిర్దారించలేదు. ఖండించనూ లేదు. నిజానిజాలు ఎలా వున్నా తాజా షాకింగ్ పరిణామాలతో పాక్ సర్కార్ షేక్ అవవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
