Viral Video: వేలాది గొర్రెలను తీసుకెళుతున్న షిప్ సముద్రంలో బోల్తా… మూగజీవాలు ఎలా బయటపడ్డాయంటే…
ఎర్ర సముద్రంలో కార్గో నౌక పల్టీ కొట్టింది. వేలాది గొర్రెలను రవాణా చేస్తున్న భారీ షిప్ నడి సముద్రంలో బోల్తాపడింది. దీంతో షిప్‌లోని మూగజీవాలు సముద్రంలో పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలు కాపాడుకోవడానికి గొర్రెలు అందులో ఈదుతూ కనిపిస్తున్న దృశ్యాలు...

ఎర్ర సముద్రంలో కార్గో నౌక పల్టీ కొట్టింది. వేలాది గొర్రెలను రవాణా చేస్తున్న భారీ షిప్ నడి సముద్రంలో బోల్తాపడింది. దీంతో షిప్‌లోని మూగజీవాలు సముద్రంలో పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలు కాపాడుకోవడానికి గొర్రెలు అందులో ఈదుతూ కనిపిస్తున్న దృశ్యాలు నెటిజన్స్‌ను తీవ్రంగా కలిచివేశాయి.
అయితే సముద్రంలో నౌక పడిపోయిన విషయాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి రంగంలోకి దిగారు. చిన్న చిన్న బోట్లలో వేగంగా ప్రమాద స్థలికి చేరుకున్నారు. సముద్రంలో మునిగిపోతున్న గొర్రెలను కాపడే ప్రయత్నం చేశారు. సుమారు 14వేల గొర్రెలను రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కార్గో షిప్ జిబౌటికి వెళ్తుండగా బోల్తా పడింది. యెమెన్ లోని లాజ్ ప్రావిన్స్ లోని రాస్ అల్-అరా తీరంలో ఈ ప్రమాదం సంభవించింది.
అయితే, 160 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సముద్రంలో షిప్ ముగినిపోవడం.. గొర్రెలు సముద్రంలో ఈదుతున్న దృశ్యాలు.. వాటిని స్థానిక మత్స్యకారులు కాపాడుతున్న దృశ్యాలు వీడియోలో కనపడుతున్నాయి. బోల్తా పడిన కార్గో షిప్ తలక్రిందులుగా కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు గొర్రెలు మునిగిపోకుండా వాటి ప్రాణాలను కాపాడిన మత్స్యకారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది హృదయ విదారకం అంటూ పోస్టులు పెడుతున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram
View this post on Instagram
