AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Honeymoon: ఆ దేశంలో పాములు కూడా హనీమూన్ కి వెళ్తాయని మీకు తెలుసా.. ఈ నెలలోనే వేలాది పాముల సయ్యాట..

ఇప్పటి వరకూ హనీమూన్ కోసం దంపతులు వెళ్తారని మీకు తెలుసు.. కానీ పాములు కూడా హనీమూన్‌కు వెళ్తాయని మీకు తెలుసా..అవును ఇది నమ్మలేని నిజం. ప్రతి వసంతకాలంలో మానిటోబాలోని నార్సిస్సే ఒక ప్రత్యేకమైన సంఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది. దాదాపు 75,000 నుంచి 150,000 వరకు ఒక వైపు ఎర్రటి రంగు ఉన్న గార్టెర్ పాములు సంభోగం కోసం సమావేశమవుతాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాముల సమూహం. ఈ కార్యక్రమం ప్రకృతి సౌందర్యానిక సాక్షంగా నిలుస్తుంది.

Snake Honeymoon:  ఆ దేశంలో పాములు కూడా హనీమూన్ కి వెళ్తాయని మీకు తెలుసా.. ఈ నెలలోనే వేలాది పాముల సయ్యాట..
Snakes Honeymoon
Surya Kala
|

Updated on: Apr 28, 2025 | 9:06 PM

Share

మనుషులు మాత్రమే హనీమూన్‌లకు వెళ్తారని విన్నాం.. అయితే ఈ దేశంలో పాములు కూడా హనీమూన్‌కు వెళ్తాయి. అవును కెనడాలోని మానిటోబాలోని నార్సిస్సేలో ప్రతి వసంతకాలంలో వేలాది పాములు గుహల నుంచి బయటపడతాయి. ఇది భూమిపై అత్యంత అసాధారణమైన “హనీమూన్” సమావేశం. ఇక్కడ కనిపించే పాములు రెడ్-సైడెడ్ గార్టర్ స్నేక్. అంటే ఒక వైపు ఎర్రటి రంగు ఉన్న గార్టెర్ పాములు.

ఈ నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద పాముల సంభోగ సమావేశం జరగనుంది. దీనిని నార్సిసస్ స్నేక్ డెన్స్ అంటారు. చాలా నెలలుగా నిద్రాణస్థితిలో ఉన్న ఈ పాములు సున్నపురాయి సింక్‌హోల్స్ నుంచి బయటపడి తమ హనీమూన్‌కు వెళ్తాయి. శాస్త్రవేత్తలు కూడా దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. వాతావరణం వేడెక్కడం ప్రారంభించినప్పుడు ఏప్రిల్ చివరి నుంచి మే ప్రారంభంలో.. మగ పాములు బయటకు వచ్చి ఆడ పాముల కోసం వేచి ఉంటాయి.

ఆడ పాములు బయటకు వచ్చిన తర్వాత.. ఇవి అన్నీ కలిసి ఒకే చోట సమావేశమవుతాయి. ఇది ఒక రకమైన హనీమూన్ లాంటిది. అక్కడ వారాలు లేదా నెలల తరబడి సమయం గడుపుతాయి. అయితే ఆడ పాముల కోసం కొత్తగా వచ్చిన పాముల మధ్య పోటీ ప్రారంభమవుతుంది. ఆడ పాముల కోసం మగ పాములలో పోటీ ఉంటుంది. ఆడపాముని గెలవడానికి ప్రేమ పోరాటంలో మగ పాములు పాల్గొంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

నార్సిసస్‌లో పాములు హనీమూన్‌కు ఎందుకు వెళ్తాయి?

మానిటోబాలోని ఇంటర్‌లేక్ ప్రాంతంలోని ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఈ పాములు జతకట్టడానికి అనువైన పరిస్థితులను అందిస్తాయి. ఈ ప్రాంతం సున్నపురాయితో రూపొందించబడింది. సింక్ హోల్స్ ఉన్నాయి. అదనంగా చుట్టుపక్కల ఉన్న తడి భూములు కప్పలు.. చిన్న క్షీరదాలు వంటివి పాములకు పుష్కలమైన ఆహార వనరులు.

ప్రజలు ఈ క్షణాన్ని కూడా చూడగలరు:

ఈ సమయంలో అక్కడికి వెళ్ళే శాస్త్రవేత్తలు మరియు, పర్యాటకులు మాత్రమే దీనిని చూడగలరు. ఇది ఒక ఆకర్షణ. ఏప్రిల్ చివరిలో ..యు మే మొదటి మూడు వారాలలో ఎండ ఉన్న రోజులలో పాముల సహజ దృగ్విషయం చూడవచ్చు. అయితే 3 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే చూసేందుకు వీలు ఉంటుంది.

పాములను రక్షించడానికి ఒక ప్రత్యేక బృందం కూడా ఉంది. అక్కడి ప్రభుత్వం కూడా పాముల ప్రాణాలను కాపాడటానికి అనేక చర్యలు తీసుకుంది. నార్సిస్సే ఎర్రటి వైపు ఉన్న గార్టర్ పాములు వెచ్చదనం, సహచరుల కోసం చూస్తూ భారీ సంఖ్యలో గుమిగూడి ఉండటం ఇది చూడటానికి ఒక అందమైన దృశ్యం. ఈ వార్షిక కార్యక్రమం ఒక ప్రధాన ఆకర్షణగా మారిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..