AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Tattoo: ఇంటికో హిందువు ఉద్భవిస్తాడు.. కాశీలో టాటూ కోసం బారులు తీరుతున్న ప్రజలు..

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో ఆగ్రహం పెల్లుబికింది. ప్రజలు ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది క్యాండిల్ ర్యాలీ తో నిరసన తెలియజేస్తే.. కాశీ ప్రజలు భిన్నమైన వైఖరిని అవలంబించారు. కాశీ ప్రజలు తమ చేతులపై 'హిందూ' అనే పదాన్ని టాటూలుగా వేయించుకుంటున్నారు. ఇప్పుడు మీ మతం ఏమిటి అని ఎవరూ అడగాల్సిన అవసరం లేదని అక్కడ ప్రజలు అంటున్నారు.

Hindu Tattoo: ఇంటికో హిందువు ఉద్భవిస్తాడు.. కాశీలో టాటూ కోసం బారులు తీరుతున్న ప్రజలు..
Hindu Tattoo Rush In Kashi
Surya Kala
|

Updated on: Apr 28, 2025 | 8:11 PM

Share

పూర్వకాలంలో శరీరం మీద పచ్చబొట్టు వేయించుకునేవారు. ఇప్పుడు ఆ పచ్చ బొట్టు స్థానంలో టాటూలు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా టాటూలు వేయించుకునే ఫ్యాషన్ పెరిగింది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటన తర్వాత..’హిందూ’ అనే పదంతో టాటూలు వేయించుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. టాటూయిస్టులు కూడా ఇలా హిందూ టాటూ వేయించుకునే వారికి 50% తగ్గింపును అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో భారీగా టాటూ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఈ షాపుల వద్ద రద్దీ నెలకొంది. అత్యధికంగా హిందువు అనే పదాన్ని చేతులపై టాటూలుగా వేయించుకోవడానికి వచ్చే వారు ఉన్నారు.

వారణాసిలోని పాండే ఘాట్‌లో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న కెకె.. హిందూ అనే పదాన్ని టాటూగా ప్రత్యేకంగా వేయించుకోవడానికి 25 నుంచి 30 మంది తన వద్దకు వస్తున్నారని చెప్పారు. ఎక్కువ మంది ఈ టాటూలను వేయించుకునేలా తాము హిందూ టాటూలపై 50% తగ్గింపును ప్రకటించినట్లు వెల్లడించాడు. టాటూ వేయించుకోవడానికి రూ. 1500 వసూలు చేస్తామని.. అయితే ఇప్పుడు 50% డిస్కౌంట్ ఇచ్చినందున రూ. 750 మాత్రమే వసూలు చేస్తున్నామని కె.కె. చెప్పారు.

ఇప్పుడు మతం గురించి అడగాల్సిన అవసరం లేదు

శివ్‌పూర్ నివాసి సునీల్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి ప్రజలను చంపేశారు.. అయితే ఇప్పుడు మీ మతం ఏమిటి అని అడగాల్సిన అవసరం ఉండదని అన్నారు. ప్రజలు తమ గుర్తింపును స్పష్టంగా అందరికీ తెలిసేలా చేతులపై హిందూ అనే పదాన్ని రాసుకుంటున్నామని చెప్పారు. సోనార్‌పూర్‌కు చెందిన రీనా ఇదే విషయంపై కోపాన్ని వ్యక్తం చేసింది. ఉగ్రవాదులు అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందించడం ఇప్పుడు మన బాధ్యత అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

హిందూ పేరుతొ పచ్చబొట్లు వేయించుకుంటున్న కాశీ ప్రజలు

‘మీరు ఎంతమంది హిందువులను చంపినా.. ప్రతి ఇంటి నుంచి ఒక హిందువు ఉద్భవిస్తాడు’ అని తాము ఉగ్రవాదులకు చెప్పాలనుకుంటున్నాము. “హిందూ” అని వ్రాసిన పచ్చబొట్టు వేయించుకోవడం ద్వారా.. మేము ప్రాణాలు కోల్పోతున్నా సరే తమ గుర్తింపుని దాచుకోమనే సందేశాన్ని ఉగ్రవాదులకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద సంఘటనతో కాశీ ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు. వారి చేతులపై హిందూ అనే పదాన్ని పచ్చబొట్టుగా వేయించుకోవడం ద్వారా వారికి బలమైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

వారణాసి ప్రజలు ఇప్పుడు టాటూ వేయించుకోవడం ద్వారా తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేశామా అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై ఎప్పుడు చర్య తీసుకుంటుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పహల్గామ్‌లో AK-47 రైఫిల్స్‌తో సాయుధులైన ఉగ్రవాదులు పర్యాటకులను మతం గురించి అడిగి మరీ కాల్చి చంపారు. దీనిపై ప్రస్తుతం దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అందరూ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..