AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాస్తున్న పరీక్ష మధ్యలో ఆపించి.. విద్యార్ధితో కోడి కోయించి ముక్కలు కొట్టించిన టీచర్‌!

ఎంతో శ్రద్ధగా పరీక్ష రాస్తున్న విద్యార్థి పరీక్ష మధ్యలో ఆపేసి.. కోడిని తీసుకువచ్చి దానిని శుభ్రం చేసి ముక్కలు కొట్టాలని ఓ ప్రభుత్వ టీచర్ 9వ తరగతి విద్యార్ధికి పురమాయించాడు. దీంతో చేసేదిలేక ఆ స్టూడెంట్‌తో కోడి కోసి, స్కిన్‌ తీసి, ముక్కలుగా కట్‌ చేయగా.. సదరు టీచర్‌ వండేందుకు ఆ కోడి మాంసాన్ని తన ఇంటికి పంపించాడు..

రాస్తున్న పరీక్ష మధ్యలో ఆపించి.. విద్యార్ధితో కోడి కోయించి ముక్కలు కొట్టించిన టీచర్‌!
Teacher Forces Student To Cut Chicken
Srilakshmi C
|

Updated on: Apr 28, 2025 | 8:04 PM

Share

జైపూర్‌, ఏప్రిల్ 28: ఎంతో బాధ్యతాయుతంగా విద్యార్ధుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ ప్రభుత్వ టీచర్‌.. ఉపాధ్యాయ వృత్తికే కలకలం తెచ్చాడు. ఎంతో శ్రద్ధగా పరీక్ష రాస్తున్న విద్యార్థి పరీక్ష మధ్యలో ఆపేసి.. కోడిని తీసుకువచ్చి దానిని శుభ్రం చేసి ముక్కలు కొట్టాలని పురమాయించాడు. దీంతో చేసేదిలేక ఆ స్టూడెంట్‌తో కోడి కోసి, స్కిన్‌ తీసి, ముక్కలుగా కట్‌ చేయగా.. సదరు టీచర్‌ వండేందుకు ఆ కోడి మాంసాన్ని ఇంటికి పంపించాడు. ఈ విషయం గ్రామంలోని జనాలకు తెలియడంతో వారు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు టీచర్‌ సస్పెండ్‌ అయ్యాడు. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

కొటాడ ప్రాంతంలోని ప్రభుత్వ బడిలో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. 9వ తరగతి విద్యార్థి రాహుల్ కుమార్ పరీక్ష రాస్తుండగా టీచర్‌ మోహన్‌లాల్ దోడా మధ్యలో విద్యార్ధిని పిలిచాడు. అతడు పరీక్ష రాయడాన్ని మధ్యలోనే ఆపించిమరీ.. ఆ స్టూడెంట్‌ చేత కోడిని కోయించి, దాని స్కీన్‌ తీసి ముక్కలుగా కట్‌ చేయించి, వంట చేసేందుకు తన ఇంటికి పంపించాడు. ఆ ఊరి జనాలకు ఈ విషయం తెలియడంతో టీచర్‌ మోహన్‌లాల్ ప్రవర్తనపై మంత్రి బాబులాల్ ఖరారీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని మంత్రి సబ్-డివిజనల్ అధికారి హస్ముఖ్ కుమార్‌ను ఆదేశించారు.

మరోవైపు సదరు స్కూల్‌ టీచర్‌ మోహన్‌లాల్ నెల కిందట స్కూల్‌ వంట మనిషిని కూడా తొలగించాడు. నాటి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. అలాగే విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. సబ్-డివిజనల్ ఆఫీసర్ విచారణ నివేదికలో మోహన్ లాల్ దోడా పాఠశాలలో పరీక్ష సమయంలో 9వ తరగతి విద్యార్థి రాహుల్ కుమార్ పార్గిని కోసి, చర్మం కోసి, శుభ్రం చేయించాడని తేలడంతో ఆ మేరకు నివేదిక సమర్పించాడు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..