Watermelon Drinks: వేసవిలో చల్లదనం కోసం పుచ్చకాయతో ఈ డ్రింక్స్ తయారు చేసుకోండి.. రెసిపీ మీ కోసం
వేసవిలో శరీరం చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ కంటే సహజమైన పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తినే ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ తినడానికి ఇష్టపడకపోతే.. పుచ్చకాయతో రకరకాల రుచికరమైన పానీయాలను తయారు చేసి తాగవచ్చు. వీటిని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం.

వేసవిలో తినే ఆహారం, పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సీజన్ లో తీవ్రమైన సూర్యకాంతి, అధిక చెమట కారణంగా శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. కనుక ఈ సమయంలో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలు తినడం మంచిది. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో పాటు చల్లదనాన్ని అందించడంలో సహాయపడతాయి. ఇందులో పుచ్చకాయ కూడా ఒకటి. వేసవిలో పుచ్చకాయని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది.
పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. దీనితో పాటు పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం అలాగే విటమిన్లు సి, ఎ , బి6 వంటి పోషకాలు ఇందులో కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాదు జీర్ణక్రియకు సహా అనేక ఇతర విధాలుగా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో పుచ్చకాయని తినే ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు పుచ్చకాయ తినడానికి ఇష్టపడకపోతే.. పుచ్చకాయతో రుచికరమైన పానీయాలను తయారు చేసి త్రాగవచ్చు.
పుచ్చకాయ మోజిటో: వాటర్ మెలోన్ మోజిటో తయారు చేయడానికి ముందుగా పుచ్చకాయను పెద్ద ముక్కలుగా కోయండి. దీని తరువాత మిక్సర్ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ని .. వేరొక గిన్నెలోకి ప్యూరీని ఫిల్టర్ చేయండి. రసాన్ని ఒక గ్లాసులో పోసి.. అందులో పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, బ్రౌన్ చక్కెర పొడి, నిమ్మరసం వేసి కలపండి. ఈ జ్యూస్ చల్లగా ఉండేందుకు ఐస్ క్యూబ్స్ వేయండి. అంతే చల్లని పుచ్చకాయ మోజిటో రెడీ.
పుచ్చకాయ స్మూతీ: మీరు స్మూతీస్ తాగడానికి ఇష్టపడితే.. ఇంట్లో తయారు చేసుకోవడం మంచి ఎంపిక. దీన్ని తయారు చేయడానికి పుచ్చకాయ, స్ట్రాబెర్రీలను కట్ చేసి తేనె, పుదీనా, పాలు, పెరుగును బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయండి. దీన్ని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ బాగా చిక్కగా ఉంటే అవసరాన్ని బట్టి నీటిని జోడించవచ్చు. అంతే పుచ్చకాయ స్మూతీ సిద్ధం అయినట్లే.
పుచ్చకాయ షర్బత్: దీన్ని తయారు చేయడానికి ముందుగా పుచ్చకాయను బాగా కడిగి.. చిన్న ముక్కలుగా కట్ చేసి.. విత్తనాలను తొలగించండి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి రసం తయారు చేసుకోవాలి. ఆ రసంలో చక్కెర, నిమ్మరసం, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. షర్బత్ కొంచెం మందంగా అనిపిస్తే దానికి కొంచెం చల్లటి నీరు కలిపి పలుచన చేసుకోవచ్చు. పుచ్చకాయ షర్బత్ లో ఐస్ క్యూబ్స్ వేసి కలపండి. చల్లగా చల్లగా అందించండి.
పుచ్చకాయ జ్యూస్: దీనిని తయారు చేయడానికి ముందుగా పుచ్చకాయను కోసి.. ముక్కల నుంచి విత్తనాలను వేరు చేయండి. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. మీకు కావాలంటే, ఈ జ్యూస్ లో నీరు కూడా కలపవచ్చు. రుచికి తగ్గట్టుగా రసంలో చక్కెర వేసుకుని మళ్ళీ కలపండి. పుచ్చకాయ జ్యూస్ రుచిని పెంచడానికి.. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా ఆకులను కూడా జోడించవచ్చు. ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ ని ఒక గ్లాసులో ఫిల్టర్ చేయండి లేదా ఫిల్టర్ చేయకుండా ఐస్ క్యూబ్స్‌తో సర్వ్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








