AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో నీరు నిల్వ ఉండే పాత్రను ఏదిశలో పెట్టుకోవడం శుభప్రదం.. ఏ దిశలో పెట్టుకుంటే అశుభం అంటే..

ప్రతి ఇంట్లో నీరు నిల్వ చేసుకోవడానికి ఒక కుండని లేదా ఒక పాత్రని ఉపయోగిస్తారు. అయితే ఇంట్లో నీటి పాత్రను పెట్టుకునే విషయంలో కూడా వాస్తు నియమాలున్నాయి. వాస్తు ప్రకారం నీరు నిల్వ చేసే కుండను సరైన దిశలో ఉంచడం శ్రేయస్సుని, అదృష్టాన్ని తెలుస్తుంది. తప్పు దిశలో ఉంచితే అది సమస్యలను కలిగిస్తుంది.

Vastu Tips: ఇంట్లో నీరు నిల్వ ఉండే పాత్రను ఏదిశలో పెట్టుకోవడం శుభప్రదం.. ఏ దిశలో పెట్టుకుంటే అశుభం అంటే..
Vastu Tips
Surya Kala
|

Updated on: Apr 28, 2025 | 3:32 PM

Share

హిందూ మతంలో వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడదు. అంతేకాదు ఏదైనా వాస్తు దోషం ఉంటే అవి తొలగించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, కుటుంబ సభ్యులందరిలో ప్రేమ పెరుగుతుంది. జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సరైన వస్తువులను సరైన ప్రదేశాలలో ఉంచకపోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ప్రస్తావించబడ్డాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి.

వాస్తు శాస్త్రంలో దిక్కులకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రతి మూలకానికి, ప్రతి దేవతకు వాస్తు శాస్త్రంలో దాని సొంత స్థానం ఉంది. మనం ఇంట్లో వస్తువులను దానికి అనుగుణంగా ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే.. మన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది.

ఇంట్లో ఎప్పుడూ ఆహారం, నీటికి కొరత ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా ఇంట్లో తినడానికి లోటు లేకుండా ఉండాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆహారం, నీరు పెట్టుకునే బిందెలను తగిన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు ప్రకారం నీటి బిందెను ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ సూచించబడింది. దీనిని జాగ్రత్తగా చూసుకోకపోతే.. సానుకూల శక్తికి బదులుగా.. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించవచ్చు. కనుక ఇంట్లో నీటి బిందెను ఉంచడానికి సరైన దిశ ఏమిటో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఏ దిశ అత్యంత శుభప్రదమైనది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలలో నీరు ఉన్న పాత్రలను పెట్టుకోవచ్చు. అంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి ఎందుకంటే ఈ దిశ వరుణ దేవుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఈశాన్య మూల బృహస్పతి దిశ. అందుకే నీటి పాత్రను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నీటి పాత్ర లేదా కుండను ఉంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంతానం పెరుగుదల, ఇంట్లో పురోగతి, విజయం లభిస్తాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.

ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటే

  1. నీరు నిల్వ చేసే పాత్రను ఎల్లప్పుడూ మూసి ఉంచాలి. ప్లాస్టిక్, ఉక్కు లేదా లోహ వస్తువులతో కప్పకండి.
  2. వీలైతే.. దానిని మస్లిన్ వస్త్రంతో లేదా మట్టి మూతతో కప్పండి.
  3. నీరు నిల్వ చేసే బిందెలను ఉంచే స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఎల్లప్పుడూ పాత్రలను శుభ్రంగా.. చక్కగా ఉంచండి.
  4. పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. దానిని ఎల్లప్పుడూ నీటితో నింపండి.

ఏ దిశలో నీరు ఉన్న కుండలను ఉంచవద్దు అంటే..

వాస్తు ప్రకారం నైరుతి దిశ భూమి దిశ, కనుక ఈ దిశలో నీరు ఉన్న పాత్రను ఉంచకూడదు. పూల కుండీలను కూడా దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదం కాదు. ఈ స్థలంలో నీటి పాత్రలు లేదా కుండలు ఉంచడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దక్షిణ దిశలో నీటి కుండ ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా