- Telugu News Photo Gallery Summer skin care tips: How to use milk for glowing skin follow these tips in telugu
Summer Care Tips: వేసవిలో చర్మ సంరక్షణకు పచ్చి పాలు బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్.. ఎలా ఉపయోగించాలంటే..
వేసవిలో శరీరం ఆరోగ్యంగా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య ఆహారం, పానీయాలు తీసుకుంటారు. చర్మ సంరక్షణ కోసం పచ్చి పాలు ఒక అద్భుతమైన సహజ నివారణ. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాదు ప్రకాశవంతంగా కూడా చేస్తుంది. ఇది ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చర్మ సంరక్షణలో పచ్చి పాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
Updated on: Apr 28, 2025 | 4:27 PM

వేసవిలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సూర్యరశ్మి , కాలుష్యం చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ సీజన్‌లో పాలని ఉపయోగించి చర్మానికి మెరుగులు దిద్దుకోవచ్చు. మన వంటగదిలో పచ్చి పాలు సులభంగా దొరుకుతాయి. ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లం, విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. మృదువుగా ,ప్రకాశవంతంగా మారుస్తాయి.

నిజానికి పచ్చి పాలు ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి పనిచేస్తుంది. ఇది చర్మం నుంచి మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనితో పాటు పచ్చి పాలు తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ సంరక్షణ కోసం పచ్చి పాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ముఖం మీద అప్లై చేయండి: ముందుగా పచ్చి పాలను ఒక దూదిపై వేసి తేలికగా ముఖంపై అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడమే కాదు చర్మం నుంచి మురికిని, అదనపు నూనెను తొలగిస్తుంది. మీ చర్మాన్ని శుభ్రంగా , తాజాగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఉదయం.. సాయంత్రం పచ్చి పాలను వాడండి.

పచ్చి పాలు తేనె మిశ్రమం: పచ్చి పాలు, తేనె రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. ఈ ప్యాక్ తయారు చేయడానికి ఒక చెంచా తేనెను ఒక చెంచా పచ్చి పాలతో కలిపి మిశ్రమాన్ని బాగా సిద్ధం చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు, చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.

పచ్చి పాలు శనగపిండి మిశ్రమం: పచ్చి పాలు, శనగపిండి మిశ్రమం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాక్ ముఖం నుంచి అదనపు నూనెను తొలగిస్తుంది. దీనిని తయారు చేయడానికి రెండు స్పూన్ల శనగ పిండిని కొంచెం పచ్చి పాలతో కలిపి పేస్ట్ గా తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్ చర్మపు రంగును మెరుగుపరచడంలో.. మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.




