AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mothers Day 2025: మదర్స్ డే రోజున అమ్మకి అందమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాల్లో పర్యటన బెస్ట్ బహుమతి

సృష్టిలో అపురూపమైన అమ్మ కో రోజు కావాలని యావత్ ప్రపంచం మదర్స్ డేని జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం నాడు మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మీకు జన్మనిచ్చి మీకంటూ ఓ భవిష్యత్ ఏర్పడేందుకు కొవ్వొత్తిలా కరిగిన.. కరుగుతున్న మీ మాతృదేవతతో ప్రత్యేకంగా మదర్స్ డే ని జరుపుకోవాలనుకుంటున్నారా.. అమ్మతో కలిసి ఈ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రోజువారీ పనులకు దూరంగా మీ ప్రియమైన అమ్మతో ఎంతో సంతోషంగా గడపడానికి అవకాశం లభిస్తుంది.

Mothers Day 2025: మదర్స్ డే రోజున అమ్మకి అందమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాల్లో పర్యటన బెస్ట్ బహుమతి
Mothers Day 2025Image Credit source: social media
Surya Kala
|

Updated on: Apr 28, 2025 | 7:44 PM

Share

పిల్లలకు జన్మనివ్వడం నుంచి తన కడుపున పుట్టిన పిల్లల అవసరాలన్నింటినీ తీర్చడం కోసం… అమ్మ తన సొంత అవసరాలను మరచిపోయి తన పిల్లల ప్రతి కోరికను తీరుస్తుంది. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం, వారి కోరికలను తీర్చడం తన బాధ్యతగా భావిస్తుంది. ఆదివారాలతో పాటు పండగలు స్పెషల్ డేస్ అంటూ అందరికీ స్కూల్ కి, ఆఫీసుకి సెలవులు ఉంటాయి. అయితే అమ్మకు మాత్రం ఏడాదిలో 365 రోజులూ ఏదోక పని చేస్తూనే ఉంటుంది. ఒక రోజు కూడా విరామం తీసుకోకుండా తన ఫ్యామిలీ కోసం గడియారంలా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.

కనుక ఈ మదర్స్ డే రోజున అమ్మకు కొంచెం విశ్రాంతిని ఇవ్వాలని భావిస్తే కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళవచ్చు. ఇలా కొత్త ప్రదేశాలకు తీసుకుని వెళ్ళడం అమ్మకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది . అంతేకాదు రోజూ చేసే పని నుంచి కొంతకాలం విరామం కూడా లభిస్తుంది. వాస్తవానికి అమ్మను బయటకు తీసుకెళ్లడానికి లేదా ఆమెను ప్రత్యేకంగా భావించడానికి ప్రత్యేక రోజు అవసరం లేదు.. అయితే బిజీ జీవనశైలి కారణంగా అమ్మతో గడిపేందుకు సమయం కేటాయించడం చాలా కష్టం అవుతుంది. కనుక మదర్స్ డే రోజున తల్లితో పాటు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచి ఎంపిక.

నైనిటాల్: ఢిల్లీ కి వెళ్ళాలని భావిస్తున్నా.. ఇక్కడ నివసిస్తున్నా నైనిటాల్ వెళ్ళవచ్చు. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ నైని సరస్సులో బోటింగ్ చేయవచ్చు. అలాగే స్నో వ్యూ పాయింట్ నుంచి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. నైని శిఖరం ఇక్కడ ఎత్తైన శిఖరం.. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. దీనితో పాటు నైనా దేవి ఆలయం , హనుమాన్‌గఢిని సందర్శించవచ్చు. అంతేకాదు పాంగోట్, షాంఘర్ సమీపంలోని చాలా అందమైన గ్రామాల్లో ఎంజాయ్ చేయవచ్చు. ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన ప్రదేశంలో సమయం గడపాలనుకుంటే ఇక్కడికి అమ్మతో వెళ్ళవచ్చు.

ఇవి కూడా చదవండి

ఊటీ: వేసవిలో పర్యటనకు ఊటీ కూడా ఉత్తమమైన ఎంపిక. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉన్న ఈ నగరం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంది. మార్చి నుంచి జూన్ వరకు వేసవిలో ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం. ఇక్కడ మీరు ఊటీ సరస్సు, ఊటీ బొటానికల్ గార్డెన్, ఊటీ టాయ్ ట్రైన్ , ఊటీ రోజ్ గార్డెన్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. దీనితో పాటు దొడ్డబెట్ట శిఖరం, పైకారా జలపాతం, పైకారా సరస్సు, అవలాంచె సరస్సు, ఎమరాల్డ్ సరస్సు వంటి సహజ సౌందర్యంతో నిండిన ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్కడ ఉన్న జింకల పార్క్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది.

ఉదయపూర్: అమ్మతో ప్రకృతి మధ్య గడపాలనుకుంటే ఉదయపూర్ సందర్శించడానికి వెళ్ళవచ్చు. దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. అందమైన సరస్సులు , అద్భుతమైన రాజభవనాలను అన్వేషించడానికి , అక్కడి సంస్కృతి గురించి తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇక్కడ మీరు పిచోలా సరస్సు, సిటీ ప్యాలెస్, సజ్జన్‌గఢ్ ప్యాలెస్, దూద్ తలై మ్యూజికల్ గార్డెన్, ఫతే సాగర్ లేక్, జైసమంద్ సరస్సు, సహేలియన్ కి బారి, రోజ్ గార్డెన్, జూ, జగ్ మందిర్ ప్యాలెస్, బడా మహల్, మహారాణా ప్రతాప్ మెమోరియల్, ఇండియన్ ఫోక్ ఆర్ట్ మ్యూజియం, లాకే పాలాయ్ మ్యూజియం, లాకే పాలాయ్ మ్యూజియం, బాగ్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఫతే సాగర్ సరస్సు, కుంభాల్‌ఘర్ కోట, జగత్ నివాస్ లతో పాటు జవహర్ నగర్‌లో రోప్‌వేలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..