- Telugu News Photo Gallery Spiritual photos Hindu Wedding Ritual: The reason behind breaking coconut on auspicious occasions
ఏదైనా శుభకార్యానికి వెళ్ళే సమయంలో కారు ముందు కొబ్బరి కాయ కొట్టడానికి అర్థం.. ప్రాముఖ్యత ఏమిటంటే..
పెళ్లి కోసం పెళ్లి మండపానికి తన ఇంటి నుంచి బయతలు దేరే వరుడి వాహనం ముందు కొబ్బరి కాయని కొడతారు. అంతేకాదు వివాహ క్రతువు ముగిసిన అనంతరం వధువుకి వీడ్కోలు ఇచ్చే సమయంలో కారు చక్రాల కింద నిమ్మకాయలు పెడతారు. కారు ముందు కొబ్బరి కాయ కొడతారు. అయితే ఈ ఆచారం ప్రాంతీయ బేధం లేకుండా ప్రతి హిందువు ఇంట్లో పాటిస్తారు. ఇలా ఎందుకు ఆచరిస్తారో పెద్దలు మాత్రమే కాదు. నేటి తరానికి పెద్దగా ఈ ఆచారం గురించి తెలియదు. ఈ నేపధ్యంలో ఈ ఆచారం ఎందుకు ఆచరించబడుతుందో ఈరోజు తెలుసుకుందాం.
Updated on: Apr 28, 2025 | 6:54 PM

పెళ్ళికి మండపానికి వధూ వరులు వెళ్ళే సమయంలో ఉపయోగించే వాహనం చక్రాల కింద లేదా.. ఏదైనా తీర్ధయాత్రలు శుభకార్యాలకు వెళ్ళే ముందు కారు చక్రాల కింద నిమ్మకాయలు పెడతారు. కొబ్బరి కాయ కొడతారు. దీని గురించి ప్రజల్లో భినాభిప్రాయాలున్నాయి. అయితే ఈ సంప్రదాయాన్ని కారు వెళ్తున్న సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటాని కొబ్బరికాయ కొడతారు. కారు నిమ్మకాయల నలిపివేస్తూ ప్రయాణిస్తుంది.

ఇలా చేయడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. హిందూ సంస్కృతిలో పెళ్లి తంతు ముగిసిన తర్వాత నవ వధువు అత్తవారింటికి భర్తతో కలిసి కారులో వెళ్ళే సమయంలో ఇలా జరుగుతుంది.

వధూవరులు వివాహ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత బాధ్యత మరింత పెరుగుతుందని చెబుతారని ప్రజలు అంటారు. వాహనం ఎక్కిన తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి వాహనం చక్రాల కింద కొబ్బరికాయ లేదా నిమ్మకాయను ఉంచి.. వాహనాన్ని వాటి మీద నుంచి ప్రయాణం ప్రారంబిస్తారు. దీనిని త్యాగం ఒక రూపం అంటారు.

ఇంటికి వెళ్ళే ముందు ఒక కొబ్బరికాయను దిష్టి తీసి ఒక పక్కకు కొడతారు. ఇలా చేయడం వలన రాబోయే సంక్షోభాన్ని కొబ్బరికాయ తీసివేస్తుందని భావిస్తారు. ఇలా చేయడం వలన వధూవరుల కారు సురక్షితంగా గమ్యానికి చేరుకుంటుంది.. దేవుడు వారిని రక్షిస్తాడని నమ్మకం.

వివాహ సమయంలో వధూవరుల కుటుంబాలు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. ఈ చర్యనే తాంత్రిక చర్య అని కూడా అంటారు. హిందూ సంస్కృతిలో కొబ్బరికాయలను బలిగా అర్పిస్తారు. చెడు దృష్టి నుంచి రక్షించడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు.

ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




