Telangana: పాఠశాలల సెలవుల పొడిగింపుపై సర్కార్ తర్జనభర్జన? నేడు బడులు పునఃప్రారంభం ఉన్నట్టా.. లేనట్టా..

భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు గురు, శుక్ర, శనివారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షాల ధాటికి చాలా చోట్ల విద్యాసంస్థలు పాక్షికంగా..

Telangana: పాఠశాలల సెలవుల పొడిగింపుపై సర్కార్ తర్జనభర్జన? నేడు బడులు పునఃప్రారంభం ఉన్నట్టా.. లేనట్టా..
Telangana Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 24, 2023 | 7:39 AM

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు గురు, శుక్ర, శనివారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షాల ధాటికి చాలా చోట్ల విద్యాసంస్థలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షపునీరు గదుల్లో చేరిందని, కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు. కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు.

కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉండటం వల్ల విద్యుత్‌ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) నుంచి పునః ప్రారంభమవుతాయా? లేదా అనే విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఇంకా పడుతున్న నేపథ్యంలో సెలవులు ఇంకా పొడిగిస్తారా? అనే విషయంలోనే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కొన్ని జిల్లాల అధికారులు మాత్రం ఈ సమయంలో స్కూళ్లు తెరవడం అంత మంచిది కాదంటున్నారు.

మరో వైపు పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే పలు కారణాల వల్ల బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు పొడిగించడం సరికాదని టీచర్లు అంటున్నారు. ప్రమాదకరంగా ఉన్న స్కూళ్లను గుర్తించి, ఆ స్కూళ్లలో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటే వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.