Telangana Congress: టికెట్ల వ్యవహారం హైకమాండ్‌కే వొదిలేద్దాం.. 100 డేస్ ప్లాన్‌పై టీపీసీసీ కీలక నిర్ణయాలు..!
Telangana Congress: ఎన్నికల ఎజెండానే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహలకు పదును పెడుతుంది.. భారీగా చేరికలు బహిరంగ సభలు, డిక్లరేషన్లు, నిత్యం ప్రజల్లో ఉండేలా బస్సు యాత్ర, ఎన్నికల హామీలపై ఫోకస్ చేసింది.. ఆ దిశగా రాజకీయ వ్యవహారల కమిటీ (పీఏసీ) సమావేశం..

Telangana Congress: ఎన్నికల ఎజెండానే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహలకు పదును పెడుతుంది.. భారీగా చేరికలు బహిరంగ సభలు, డిక్లరేషన్లు, నిత్యం ప్రజల్లో ఉండేలా బస్సు యాత్ర, ఎన్నికల హామీలపై ఫోకస్ చేసింది.. ఆ దిశగా రాజకీయ వ్యవహారల కమిటీ (పీఏసీ) సమావేశం.. ఆదివారం గాంధీ భవన్‌లో హాట్ హాట్ గా జరిగింది.. టీపీసీసీ ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పిఏసి కన్వీనర్ షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పి నేత బట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి తోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే, మొదటిసారి పీఏసీ సమావేశానికి స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి హాజరుకావడం గమనార్హం.. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొలు సైతం హాజరయ్యారు.
పీఏసీ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై వ్యూహకర్త సునీల్ కనుగొలు గంటకుపైగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం కాంగ్రెస్ నేతల గెలుపు, ఓటములు నేతల పనితీరు,100 రోజుల కార్యాచరణ తదితర అంశాలపై వివరించినట్లు సమాచారం.. వీటితో పాటు పార్టీలో ఎవరెవరు చేరాలనుకుంటున్నారో.. వారి పేర్లతో కూడిన నివేదికను సునీల్ కనుగొలు పిఏసి ముందు ఉంచారు. టికెట్ల కేటాయింపులో హైకమాండ్ దే తుది నిర్ణయమని, ఎలాంటి లాబీయింగ్ లకు అవకాశం లేదని సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ నేతలు సమిష్టి నిర్ణయానికి వచ్చారు. కర్ణాటక మాదిరి తమ ప్రభుత్వం వస్తే ఎం చేస్తామో ప్రచారం చేయాలని.. రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, ఇళ్ల నిర్మాణం కి 5 లక్షల కేటాయింపు.. పేదలకు 500 కి గ్యాస్ ఇవ్వడం, 4 వేల పెన్షన్ గ్యారంటీ స్కీమ్ లని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని పిఏసీలో సునీల్ సూచించారు.
జులై 30 వ తేదీన కొల్లాపూర్ సభకి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని అందులో బీఆరెస్, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు ఉండనున్నాయని ప్రచారక కమిటి చైర్మన్ మధుయాష్కి తెలిపారు. ఆగస్టు 15 వ తేదీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఎస్సి, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ జరగనుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సి ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ఎం చేస్తామో తెలపడానికి రెండు రోజుల్లో సబ్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు.




రాష్ట్రం లో బస్సు యాత్ర ఎక్కడి నుంచి చేపట్టాలి, ఏయే తేదీల్లో నిర్వహించాలి.. ఎజెండా ఎలా ఉండాలి..? అనే దానిపై గతంలో అనుభవం ఉన్నవారితో ఒక కమిటీ వేసినట్లు పిఏసి కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు.. ప్రజలకు అవసరమయ్యే 5 డిక్లరేషన్ లపై నిపుణులతో చర్చిస్తామని వెల్లడించారు.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతుండడం.. ఒకవైపు పార్టీ బలోపేతం, చేరికలు, ప్రచారంపై దృష్టి సారిస్తూనే మొదటి విడత టికెట్లను ముందస్తుగా ప్రకటించేందుకు సిద్ధమవుతుండడంతో.. పార్టీ వ్యూహాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..