- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Alia Bhatt thinks her daughter Raha will become a scientist, but not an actor
Alia Bhatt: ‘నా కూతురు నాలా సినిమాల్లోకి రాకూడదు..! తను పెద్దయ్యాక..’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియ భట్ తాజాగా తల్లి అయిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్ధం పాటు సినిమాల్లో అలరించిన నటి అలియభట్ తన కూతురు మాత్రం తన అడుగుజాడల్లో నడవకూడదని అంటోంది..
Updated on: Jul 24, 2023 | 11:34 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియ భట్ తాజాగా తల్లి అయిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్ధం పాటు సినిమాల్లో అలరించిన నటి అలియభట్ తన కూతురు మాత్రం తన అడుగుజాడల్లో నడవకూడదని అంటోంది.

తన గారాలపట్టి 'రాహా' తనలా సినిమా రంగాన్ని ఎంచుకోవాలని కోరుకోవడం లేదని బాలీవుడ్ అగ్ర నాయిక అలియా భట్ అంటుంది. మరైతే తన కుమార్తె ఏం కావాలని కోరుకుంటుందనేగా మీ సందేహం..

తన కూతురు బాగా చదువుకుని గొప్ప పరిశోధనలు చేసే సైంటిస్టు కావాలన్నది తన అభీష్టమని చెప్పుకొచ్చింది. 'సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పదేళ్లలో నీ జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. నిద్రమానుకుని ఏకధాటిగా సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా కంటూ ఓ కుటుంబం ఉంది. నాకు ఓ కూతురు, భర్త ఉన్నారు. నా కుటుంబం కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నా. అలా అని సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వను. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని' చెప్పుకొచ్చింది.

అలియా తన కుమారై భవిష్యత్తు గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ సరదాగా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ‘నిజమే.. అలియా చెప్పినట్లు ఆమె కుమార్తె సినిమాలో శాస్త్రవేత్త అవుతుంది. కరణ్ జోహార్ ఆమె కోసం ఓ కొత్త కథను సిద్ధం చేసి పెట్టి ఉంటారు. సినిమాలో తప్పక శాస్త్రవేత్తగా కనిపిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అలియా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా ప్రచారంలో బిజీగా ఉంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. హాలీవుడ్‌లో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ మువీలోనూ అలియా నటిస్తోంది.





























