- Telugu News Photo Gallery Cinema photos Sudha Murthy had tears in her eyes when she watched Alia Bhatt's movie Raazi telugu cinema news
Sudha Murthy-Alia Bhatt: సుధామూర్తిని కన్నీళ్లు పెట్టించిన అలియా భట్.. ఆ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారట..
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి అందరికి తెలిసిన విషయమే. రచయిత్రిగా.. మానవతామూర్తిగా ఆమెకు ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చాలా మంది మహిళలకు ఆమె ఆదర్శం. గత కొన్నిరోజుల ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుధామూర్తి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Updated on: Jul 24, 2023 | 12:37 PM

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి అందరికి తెలిసిన విషయమే. రచయిత్రిగా.. మానవతామూర్తిగా ఆమెకు ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చాలా మంది మహిళలకు ఆమె ఆదర్శం.

గత కొన్నిరోజుల ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుధామూర్తి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గతంలో ఓ సినిమా చూసి తాను కంటతడి పెట్టుకున్నాని తెలిపారు. నిజానికి ఎప్పుడూ సినిమాలు చూసి ఎమోషనల్ కాలేదని అన్నారు. కానీ అలియా భట్ నటించిన రాజీ మూవీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట.

మొదటిసారి 1958లో ఓ సినిమా చూశానని.. అప్పటి నుంచే వైజయంతిమాలకు అభిమానిని అయ్యానని తెలిపారు. ఇక ఇప్పుడున్న తరంలో అలియా భట్ నటన అంటే ఇష్టమని అన్నారు.

అప్పుడప్పుడు సినిమాలకు.. మ్యూజిక్ వంటి వాటి గురించి చర్చించుకుంటామని అన్నారు. 2018లో విడుదలైన రాజీ సినిమాలో అలియా భట్ ఇండియా కోసం గూఢచారి పాత్రలో గొప్పగా నటించిందని అన్నారు.

డైరెక్టర్ మెఘన గుల్జర్ తెరకెక్కించిన రాజీ సినిమా 64వ ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా.

సుధామూర్తిని కన్నీళ్లు పెట్టించిన అలియా భట్.. ఆ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారట..





























