Yadamma Raju: జబర్దస్త్ కమెడిన్‌ యాదమ రాజుకు ఏమైంది..? కాలికి కట్టుతో నడవలేని స్థితిలో.. వీడియో వైరల్

బుల్లితెర కమెడియన్ యాదమ రాజు హాస్పిటల్‌లో అడ్మిటయ్యాడు. కాలికి పెద్ద కట్టుతో ఆసుపత్రి బెడ్డుపై ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అతని భార్య స్టెల్లా అతనికి సపర్యలు చేస్తూ వీడియోలో..

Yadamma Raju: జబర్దస్త్ కమెడిన్‌ యాదమ రాజుకు ఏమైంది..? కాలికి కట్టుతో నడవలేని స్థితిలో.. వీడియో వైరల్
Comedian Yadamma Raju
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 25, 2023 | 8:11 AM

బుల్లితెర కమెడియన్ యాదమ రాజు హాస్పిటల్‌లో అడ్మిటయ్యాడు. కాలికి పెద్ద కట్టుతో ఆసుపత్రి బెడ్డుపై ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అతని భార్య స్టెల్లా అతనికి సపర్యలు చేస్తూ వీడియోలో కనిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో కమెడియన్‌ యాదమ రాజు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు అరెరె.. ఏమైంది? అంటూ అరా తీస్తున్నారు. అసలింతకీ ఏం జరిగిందంటే..?

‘పటాస్’ కామెడీ షోతో తనదైన పంచులు, టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ రాజు. ఈ టీవీల ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. విలక్షణ కాన్సెప్ట్‌తో స్కిట్స్‌ వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే యాదమ రాజు సడన్‌గా కాలికి కట్టుతో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా దాడి చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. యాదమ రాజు పోస్టు చేసిన వీడియోలో ఆ వివరాలేవీ చెప్పకపోవడంతో ఏం జరిగిందనేది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని యాదమ రాజు గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.