AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: బుల్లితెర ప్రేక్షకుల నిరీక్షణకు తెర.. అమితాబ్ KBCలో సీజన్ 15 త్వరలో ప్రసారం..

23 సంవత్సరాల క్రితం అంటే 2000-2001 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్‌పతి మొదటి సీజన్ స్టార్ ప్లస్‌లో ప్రసారమైంది. ఈ షోతో 70 ఎంఎం స్క్రీన్‌ను శాసించిన అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా బుల్లి తెరపై అడుగు పెట్టారు. చాలా ప్రజాదరణ పొందింది. అయితే KBC TRP రేటింగ్ లో మాత్రం సత్తా చూపలేకపోయింది. దీంతో మొదటి సీజన్ తర్వాత, మేకర్స్ షో 4 సంవత్సరాల విరామం తీసుకున్నారు.

Amitabh Bachchan: బుల్లితెర ప్రేక్షకుల నిరీక్షణకు తెర.. అమితాబ్ KBCలో సీజన్ 15 త్వరలో ప్రసారం..
Amitabh Bachchan's Kbc
Surya Kala
|

Updated on: Jul 25, 2023 | 8:09 AM

Share

స్మాల్ స్క్రీన్ పై సంచలనం కౌన్ బనేగా కరోడ్‌పతి. గత 23 సంవత్సరాలుగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న ఈ రియాల్టీ షో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో సీజన్ 15 టీవీ స్క్రీన్‌లపైకి రాబోతోంది. ఈ షో ద్వారా మరోసారి బుల్లి తెర ప్రేక్షకులను బిగ్ బీ అమితాబ్ కలవనున్నారు. న్యూ సీజన్ లో కౌన్ బనేగా కరోడ్‌పతి  కొత్త శైలిలో ప్రసారం నున్న మొదటి ఎపిసోడ్ ఆగస్టు 15న సోనీ టీవీలో ప్రీమియర్ అవుతుంది. స్వాతంత్య దినోత్సవం నాడు ప్రారంభమయ్యే ఈ షో గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడ్తుకు ‘ఈ ఏడాది ప్రసారం కానున్న KBCలో అన్నీ మారిపోతాయి’ అని చెప్పారు.

23 సంవత్సరాల క్రితం అంటే 2000-2001 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్‌పతి మొదటి సీజన్ స్టార్ ప్లస్‌లో ప్రసారమైంది. ఈ షోతో 70 ఎంఎం స్క్రీన్‌ను శాసించిన అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా బుల్లి తెరపై అడుగు పెట్టారు. చాలా ప్రజాదరణ పొందింది. అయితే KBC TRP రేటింగ్ లో మాత్రం సత్తా చూపలేకపోయింది. దీంతో మొదటి సీజన్ తర్వాత, మేకర్స్ షో 4 సంవత్సరాల విరామం తీసుకున్నారు. ఆగస్ట్ 5, 2005న KBC సీజన్ 2 ప్రసారం అయింది. ఈ సీజన్ లో కూడా హోస్ట్ గా అమితాబ్ బచ్చన్ వ్యవహరించారు. అయితే ఇది కూడా టీఆర్పీ రేటింగ్ లో వెనుకబడింది.

ఇవి కూడా చదవండి

హోస్ట్‌గా వ్యవహరించిన షారుఖ్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనప్పుడు కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 2కి విరామం లభించింది. నిర్మాతలు KBC షో ప్రసారాన్ని నిలిపివేశారు. అనంతరం సీజన్ 3లో బిగ్ బి స్థానంలో షారూఖ్ ఖాన్ వచ్చాడు. అయితే హోస్ట్ గా అమితాబ్ బచ్చన్ మ్యాజిక్‌ను స్మాల్ స్క్రీన్‌పై రీక్రియేట్ చేయడంలో షారుఖ్ విఫలం అయ్యారు.

13 ఏళ్లుగా నిరంతరం అలరిస్తున్నారు 2010 నుండి కౌన్ బనేగా కరోడ్‌పతి షో సోనీ టీవీలో ప్రసారం అవుతోంది. గత 13 సంవత్సరాలుగా స్మాల్ స్క్రీన్ తో పాటు ఈ షో ఆన్‌లైన్‌లో కూడా ప్రజాధారణ పొందింది. ఎక్కువ మంది వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. షో ఎండింగ్ టైం లో బిగ్ బీ అనేక సార్లు ఆరోగ్య బారిన పడ్డారు. దీంతో ఇప్పుడు ప్రసారం కానున్న కేబీసీ సీజన్ బిగ్ బి చివరి సీజన్ అని ఓ పుకారు షికారు చేస్తోంది. అయితే ప్రతి సీజన్‌లోనూ కొత్త ఉత్సాహంతో, కార్యక్రమంలో పాల్గొనేవారిలో సరికొత్త ఆశలను నింపుతూ.. ప్రేక్షకులను అలరించేందుకు అమితాబ్ బచ్చన్ తిరిగి హోస్ట్ గా వస్తూనే ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..