Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి..? అసాధ్యం అంటోన్న నిపుణులు

నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సోమవారం (జులై 24) ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ సందే అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలున్నారు. వీరిలో చిన్నవాడైన రెండున్నరేళ్ల..

నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి..? అసాధ్యం అంటోన్న నిపుణులు
Lizard Killes Child
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 25, 2023 | 6:49 AM

రాయ్‌పూర్‌, జులై 25: నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సోమవారం (జులై 24) ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ సందే అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలున్నారు. వీరిలో చిన్నవాడైన రెండున్నరేళ్ల జగదీశ్‌ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో మంచంపై నిద్రిస్తున్నాడు. ఇంట్లో పనులు చేసుకుంటున్న తల్లి పిల్లాడిని గమనించలేదు. కాసేపటి తర్వాత జగదీశ్‌ను దగ్గరికి వెళ్లగా పిల్లాడి నోట్లో బల్లి కనిపించింది. ఆ సమయంలో చిన్నారి జగదీశ్‌ నిర్జీవంగా కనిపించాడు. శ్వాస కూడా ఆగిపోవడంతో ఆందోళనకు గురైన తల్లి రోదించడం మొదలుపెట్టింది.

తల్లి రోదనలు విన్న ఇరుగుపొరుగు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. నోట్లో ఉన్న బల్లితో పాటు జగదీశ్‌ కూడా మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని జగదీష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని, బల్లి నోట్లో పడడం వల్ల శ్వాశ ఆడక చనిపోయే అవకాశం ఉందని జంతుశాస్త్రం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బలరాం కుర్రే అన్నారు. బాలుడి మరణానికి గల అసలు కారణం తెలియాలంటే పోస్టుమార్టం ఫలితాలు వస్తేనే తెలుస్తుందని ఆయన అన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉండటంతో దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.