Gold Price Today: తగ్గిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం రేటు ఎలా ఉందంటే..?
Gold and Silver Latest Prices: బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని తగ్గుతూ వస్తుంటాయి.
Gold and Silver Latest Prices: బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని తగ్గుతూ వస్తుంటాయి. కాగా.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే, కొన్ని రోజుల నుంచి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా.. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,160 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ.77,500 లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,160 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 ఉంటే.. 24క్యారెట్ల ధర రూ.60,490, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,150, 24క్యారెట్ల ధర రూ.60,160 గా ఉంది. ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ.55,300 లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,320, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,150, 24 క్యారెట్ల ధర రూ.60,160 గా ఉంది.
వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా.. ముంబైలో వెండి ధర 77,500 లుగా ఉంది. చెన్నైలో వెండి ధర రూ.80,500 ఉండగా.. బెంగళూరులో రూ.76000 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వెండి ధర రూ.80,500 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. కాగా.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..