‘కార్గిల్‌తో పోరాడి దేశాన్ని కాపాడాను.. కానీ నా దేశంలోనే భార్యను కాపాడుకోలేకపోయాను’

కార్గిల్ లో దేశం కోసం పోరాడి దేశాన్ని కాపాడు కొన్నాడు కానీ సొంత భార్య నగ్న ప్రదర్శన జరగకుండ కాపాడు కొలేక పోయాడు..

'కార్గిల్‌తో పోరాడి దేశాన్ని కాపాడాను.. కానీ నా దేశంలోనే భార్యను కాపాడుకోలేకపోయాను'
Manipur Horror
Follow us
S Haseena

| Edited By: Srilakshmi C

Updated on: Jul 25, 2023 | 12:34 PM

ఇంఫాల్: కార్గిల్ లో దేశం కోసం పోరాడి దేశాన్ని కాపాడు కొన్నాడు కానీ సొంత భార్య నగ్న ప్రదర్శన జరగకుండ కాపాడు కొలేక పోయాడు..

భారతదేశంలో ప్రతి 26 జూలైన కార్గిల్ దివాస్ జరుపుకుంటారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలను వారి ఆక్రమిత స్థానాల నుండి లాడాఖ్ జిల్లాలోని ఉత్తర 9 పర్వత శిఖరాలపై నుండి తరిమికొట్టినందుకు భారతదేశం సాధించిన విజయాన్ని జరుపుకుంటాం.

ఈ సారి కూడా 24 వ కార్గిల్ దివస్ జరుపుకుంటున్నాము. కానీ దేశం కోసం 28 సంవత్సరాలు సేవచేసిన ఓ సైనికుడు కార్గిల్ యుద్ధం లో పోరాడి దేశాన్ని కాపాడాడు కానీ తన భార్యను కాపాడుకో లేక పోయాడు. ఇది ఎక్కడో కాదు తాజాగా దేశం అంతా సిగ్గుతో తల దించుకున్నా మణిపూర్ మహిళల సంఘటన లో ఇద్దరు మహిళల్లో ఓ మహిళ. భర్త పడుతున్న ఆవేదన.. అల్లరి మూకలు తమ భార్యను లాకెల్లుతుంటే ఏమి చేయలేక పోయాడు. చూస్తూ నిలబడిన పోలీస్ లు ఏమి చేయలేక పోయారు . ఎన్నో యుద్ధాలు చూసాను కానీ ఇలా మన దేశం లోనే ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించలేదని ఓ జాతీయ మీడియా రిపోర్టర్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కూడా ఏ ఒక్క పెద్దమనిషి తమ కుటుంబాన్ని పరార్శించి లేదని వాపోయాడు చివరికి విడియో వైరల్ అయ్యాక వచ్చారని అంటున్నాడు..మే 18 కేసు పెట్టిన పట్టించుకోలేదని ఆయన ఆయన భార్య పడిన నరకం అంత ఇంత కాదని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఎక్కడో మారుమూల ప్రాంతం లోని రిలీఫ్ క్యాంప్ లో పెట్టారని చివరికి తన భార్యకు వైద్య సహాయం కూడా చేయలేదని అంటున్నాడు. 28 సంవత్సరాలు మిలట్రీ లో వుండి దేశం కోసం పోరాడి ఏం లాభం తన భార్య పరువూ కాపాడుకోలేక పోయాను తన ఇంటిని తన కుటుంబాన్ని కాపాడుకోలేక పోయానని ఆవేదన చెందాడు.అల్లరి ముకలు తమను మనుషుల్లా చూడలేదని జంతువుల కంటే హీనంగా తమను ట్రీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు..ఆ సంఘటన ఒక షాక్ లో నెట్టేసింది అని బాధపడుతున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.