AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంట్‌లో గందరగోళం.. మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్ష కూటమి

ఇటీవల మణిపుర్‌లో ఇద్దరు అమ్మాయిల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అల్లర్ల అంశమే కీలకంగా మారింది. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుబట్టడంతో ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.

పార్లమెంట్‌లో గందరగోళం..  మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్ష కూటమి
Opposition Leaders
Aravind B
|

Updated on: Jul 25, 2023 | 12:46 PM

Share

ఇటీవల మణిపుర్‌లో ఇద్దరు అమ్మాయిల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అల్లర్ల అంశమే కీలకంగా మారింది. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుబట్టడంతో ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా కొన్ని నిమిషాల్లోనే వాయిదా వేశారు. మధ్యాహ్నం 2.00 గంటలకు దిగువ సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే మణిపుర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు పాటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జు్ ఖర్గే ఛాంబర్‌లో జరిగిన విపక్ష నేతల సమావేశంలో… కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మణిపుర్ అల్లర్లతో సహా అనేక కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంటుందని విపక్షాల ఆలోచనగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రధాని మణిపుర్‌పై ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడటంతో వారు వెనక్కి తగ్గుతారని కేంద్రం భావించడం లేదు. దీంతో ఇక బిల్లలు ప్రవేశపెట్టడంపైనే దృష్టి పెడుతున్నట్లు సమాచారం

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.