Telangana: చిన్నారి గొంతులో ఇరుక్కున్న పునుగులు.. ఆసుపత్రికి తరలించేలోపే.
పునుగులు.. చిన్నారి ప్రాణం తీశాయి.. ఇంట్లో తయారు చేసిన పునుగులు.. తిన్నాడు.. వెంటనే గొంతులో ఇరుక్కుంది. తీయడానికి తల్లి తీవ్ర ప్రయత్నం చేసింది. ఆసుపత్రి కి తరలించారు. అయితే అంతలోనే ఆ చిన్నారి మరణించాడని వైద్యులు చెప్పారు. ఈ హృదయవిదారక ఘటన సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పునుగులు.. చిన్నారి ప్రాణం తీశాయి.. ఇంట్లో తయారు చేసిన పునుగులు.. తిన్నాడు.. వెంటనే గొంతులో ఇరుక్కుంది. తీయడానికి తల్లి తీవ్ర ప్రయత్నం చేసింది. ఆసుపత్రి కి తరలించారు. అయితే అంతలోనే ఆ చిన్నారి మరణించాడని వైద్యులు చెప్పారు. ఈ హృదయవిదారక ఘటన సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం కేంద్రంలో మారుతి, కవితలు కూలి పనిచేసుకుంటే జీవిస్తున్నారు. వీరికి క్రాంతి అనే 13 నెలల బాలుడు ఉన్నారు.
ఇంట్లో పునుగులు చేస్తున్న సమయంలో బాలుడు వాటిని తిన్నాడు. బాలుడు తనంతట తాను పునుగును నోట్లో వేసుకోవడంతో గొంతులో ఇరుక్కుంది. దీనిని గమనించిన తల్లి గొంతులో ఇరుక్కున్న పునుగును తీయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఎంతకీ పునుగు గొంతులో నుంచి బయటకు రాలేదు. అప్పటికే బాలుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో హుటాహుటిన కుర్రాడిని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి వెళ్లిన తర్వాత బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. పునుగు గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 13 నెలల బాలుడు పునుగు ఇరుక్కొని మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. క్రాంతీ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటి వరకు ఆడుకుంటూ సందడి చేసిన బాలుడు మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..